నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి లాంఛనంగా క్లాప్ కొట్టారు. కథానాయిక ఎవరన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే ఈ లిస్టులో చాలా పేర్లు వినిపించాయి. అందులో సోనాక్షి సిన్హా పేరు కూడా ఉంది. సోనాక్షిని టాలీవుడ్ లో దింపాలని చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అగ్ర హీరోల సరసన.. సోనాక్షిని ఎంచుకొన్నారని చాలాసార్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ గాసిప్పులకే పరిమితమయ్యాయి.
బాలయ్య కోసం సోనాక్షి సిన్హా పేరు పరిశీలించడం వాస్తవం. ఈ మేరకు చిత్రబృందం సోనాక్షితో సంప్రదింపులు కూడా జరిపింది. సోనాక్షి కూడా బాలయ్యతో ఆడి పాడడానికి రెడీనే అంది.కానీ.. పారితోషికంగా రూ.6 కోట్లు డిమాండ్ చేసిందని టాక్. సోనాక్షికి ఆరు కోట్లంటే చాలా ఎక్కువ. తెలుగులో ఆమె పేరుతో మార్కెట్ అయ్యేదేం ఉండదు.
బాలీవుడ్ లో ఈ సినిమాని విడుదల చేస్తారా అంటే అది కూడా లేదు. అక్కడ కూడా సోనాక్షి .. ఈ సినిమాకి ప్లస్ అవ్వదు. అలాంటప్పుడు సోనాక్షికి రూ.6 కోట్లు ఇవ్వడం అనవసరమే అవుతుంది. అందుకే.. చిత్రబృందం సోనాక్షిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే పారితోషికం డిమాండ్ చేస్తుంటే.. సోనాక్షిని తెలుగులో, తెలుగు హీరోల పక్కన చూడడం అనుమానమే