బ‌న్నీకి పోటీగా నాని?

By iQlikMovies - November 19, 2018 - 10:40 AM IST

మరిన్ని వార్తలు

తెలుగు హీరోలు, ద‌ర్శ‌కుల దృష్టి త‌మిళ సినిమా `96`పై ప‌డింది. విజ‌య్ సేతుప‌తి - త్రిష జంట‌గా న‌టించిన ఈ చిత్రం త‌మిళ‌నాట కుర్రాళ్ల గుండెల్ని గిలిగింత‌లు పెడుతోంది. ఆ సినిమా రీమేక్ రైట్స్‌ని దిల్‌రాజు సొంతం చేసుకున్నారు. 

తెలుగులో ఈ సినిమాని ఎవ‌రితో తెర‌కెక్కిస్తార‌న్న సంగ‌తి ఆస‌క్తిగా మారింది. `96` రీమేక్‌లో న‌టించ‌డానికి అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నార‌ని వార్త‌లొచ్చాయి. బ‌న్నీ లాంటి స్టార్ ఇలాంటి క‌థ‌లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించ‌డం గొప్ప విష‌య‌మే. ఇప్పుడు బ‌న్నీకి పోటీగా నాని రంగంలోకి దిగాడు. ఈమ‌ధ్య `96` సినిమా చూసిన నాని... ఈ సినిమా త‌న‌కెంతో బాగా నచ్చింద‌ని, త‌ను కూడా రీమేక్ చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని దిల్‌రాజుకి హింట్ ఇచ్చాడ‌ట‌. 

ఈ త‌ర‌హా పాత్ర‌లు నానికి కొట్టిన పిండే. కాబ‌ట్టి దిల్‌రాజుకి మ‌రో ఆప్ష‌న్ దొరికిన‌ట్టైంది. ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు ఎవ‌రికి అప్ప‌గించాల‌న్న‌ది మ‌రో స‌వాల్‌. దిల్‌రాజు ఆస్థాన ద‌ర్శ‌కులు చాలామందే ఉన్నారు. వాళ్ల‌లో ఎవ‌రికైనా ఈ అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చు. లేదంటే... త‌మిళ దర్శ‌కుడినే రంగంలోకి దించినా ఆశ్చ‌ర్యం లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS