ఇటీవల ప్రముఖ నటి సోనాలీ బింద్రేకు క్యాన్సర్ సోకిందన్న న్యూస్ అందర్నీ షాక్‌కి గురి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హెయిర్ షార్ట్ చేసుకుని ఉన్న ఫోటోను సోనాలీ బిందే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
క్యాన్సర్ సోకిన వారికి ముందుగా ఎఫెక్ట్ అయ్యేది జుట్టే. మెల్ల మెల్లగా జుట్టు మొత్తం ఊడిపోతుంది. ఈ వ్యాధి తగ్గాక తర్వాత మళ్లీ జుట్టు వస్తుంది. అందుకు సింబాలిక్‌గానే సోనాలీ తన హెయిర్‌ని ముందే షార్ట్ చేసుకున్న ఫోటోని పోస్ట్ చేసింది. ఈ ఫోటో పోస్ట్ చేస్తూ, తన మనసులోని కొన్ని భావాలను అభిమానులతో పంచుకుంది.
'లైఫ్‌లో నేనే చాలా చూశాను. క్యాన్సర్ అని తెలియగానే మొదట్లో చాలా ఆందోళన చెందాను. కానీ అది కూడా చాలా మామూలు ఆనారోగ్యమే అని తెలుసుకున్నాను. సహజంగా వచ్చే, జలుబు, జ్వరం, మైల్డ్ హార్ట్ ఎటాక్ వంటి అనారోగ్యాల్లాగానే క్యాన్సర్‌ని కూడా జయించొచ్చని తెలిసింది. ఈ క్రమంలో చాలా మంది నాకు సహాయంగా నిలిచారు. వారిలో క్యాన్సర్‌ని జయించిన సెలబ్రిటీసే కాదు, సామాన్యులు కూడా ఉన్నారు. వీరంతా తనకు ధైర్యం చెప్పారు. క్యాన్సర్ అంటే భయపడక్కర్లేదు. ఇలా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని తనను వెన్ను తడుతూ ప్రోత్సహించారు. దాంతో నాకిప్పుడు భయం లేదు. ట్రీట్మెంట్ను నవ్వుతూ ఎంజాయ్ చేస్తాను. త్వరలోనే క్యాన్సర్‌ని జయించి తిరిగి వస్తాను. వచ్చి క్యాన్సర్‌ని ఎలా గెలవాలి అని అందరికీ చెబుతాను..' అని సోనాలీ బింద్రే తెలిపింది.