ప్రముఖ సింగర్ సోను నిగమ్ ఈమధ్యనే అజాన్ కి సంబంధించి చేసిన వ్యాఖ్యలతో వార్తలో వ్యక్తిగా నిలిచాడు.
అయితే అతని వ్యాఖ్యలను ఖండిస్తూ పశ్చిమ బెంగాల్ లోని ఒక మసీదు నుండి సోను నిగమ్ గుండు గీసిన వారికి రూ 10 లక్షలు ఇవ్వబడును అని ఒక ఫత్వా వెలువడింది.
దీనితో కలత చెందిన సోను నిగమ్, తనకు తానే గుండు చేయించుకున్నాడు. ఆ తరువాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ- తన వ్యాఖ్యలని తప్పుగా అర్ధం చేసుకున్నారని, అలాగే తనకి గుండు చేసినవ్యక్తి కూడా ఒక ముస్లిం అని స్పష్టం చేశాడు.
ఇదంతా తను చేస్తున్నది, తన పై వచ్చిన యాంటీ-ముస్లిం అనే ముద్రని తొలగించుకోవడానికి మాత్రమే అని కుండబద్దలు కొట్టేశాడు.
ఇప్పటికి తను అజాన్ కి వ్యతిరేఖం కాదు అని కేవలం లౌడ్ స్పీకర్స్ వాడటం పైనే తన అభ్యంతరం అని పేర్కొన్నాడు.
మొత్తానికి ఒక చిన్న వ్యాఖ్య అతన్ని తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.