ఆపద ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్నాడు సోనూసూద్. కష్టం ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమైపోతున్నాడు సోనూ సూద్. జస్ట్... ఒక్క ట్వీట్ వేస్తే చాలు. క్షణాల్లో రిప్లై ఇస్తున్నాడు. ఇలా చాలామందికి సాయం అందించిన సోనూ.. ఇప్పుడు డాన్స్ మాస్టర్ శివ శంకర్ కి కూడా ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చాడు. జాతీయ స్థాయిలో ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు పొందిన శివ శంకర్ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది.కోవిడ్ కారణంగా ఆయన ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
శివ శంకర్ మాస్టర్ ని ఆదుకోవాలని రెండు రోజులుగా సోషల్ మీడియాలో... సందేశాలువెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం సోనూ సూద్ వరకూ వెళ్లింది. సోనూ కూడా వెంటనే స్పందించాడు. శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, అవసరమైన సహాయం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సోనూ ట్వీట్ చేశాడు. సోనూ రంగంలోకి దిగితే ఇంకేముంది? ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. ఇంత త్వరగా స్పందించి, సాటి కళాకారుడ్ని ముందుకొచ్చిన సోనూని నెటిజన్లు ఎప్పటిలానే ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వెల్ డన్ సోనూ..!