కంగనా దెబ్బకి సోనూ సూద్‌ ఔట్‌

మరిన్ని వార్తలు

'మణికర్ణిక' సినిమా వరుస వివాదాలతో వార్తల్లోకెక్కుతోంది. ఈ సినిమా నుంచి దర్శకుడిగా క్రిష్‌ బాధ్యతల్ని కొంతవరకు 'కట్‌' చేసేసింది హీరోయిన్‌ కంగనా రనౌత్‌. ఈ సినిమా విషయంలో మొదటి నుంచీ ప్రత్యేకమైన ఆసక్తితో 'అతి' చేస్తున్న కంగనా, ఈ మధ్య దర్శకత్వ బాధ్యతల్నీ క్రిష్‌ నుంచి లాగేసుకుంది. సినిమాకి సంబంధించి కొంత ప్యాచ్‌ వర్క్‌ కోసమే అలా చేయాల్సి వచ్చిందనీ, ఆ సమయంలో క్రిష్‌ అందుబాటులో లేకపోవడంతోనే దర్శకత్వం వైపు కంగనా మళ్ళాల్సి వచ్చిందనీ 'మణికర్ణిక' టీమ్‌ వివరణ ఇచ్చింది. 

అయితే ఇంతలోనే ప్రముఖ నటుడు సోనూ సూద్‌ (పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటించాడు. ముఖ్యంగా 'అరుంధతి' సినిమాలో పశుపతి పాత్రలో అదరగొట్టేశాడు) ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. క్రిష్‌ ఎప్పుడైతే 'మణికర్ణిక' సినిమా నుంచి బయటకు వచ్చాడో, ఆ వెంటనే సోనూ సూద్‌ పాత్రని చాలావరకు కత్తిరించేసింది కంగనా రనౌత్‌. పైగా సెట్స్‌లో ఇలా చేయాలి, అలా చేయలంటూ సోనూ సూద్‌పై కంగన ఒత్తిడి తీసుకొస్తుండడంతో ఆ ఒత్తిడిని భరించలేక సోనూ సూద్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. 

వాస్తవం ఇలా ఉంటే, సోనూ సూద్‌ ప్రొఫెషనల్‌ నటుడనీ, ఆయనకు వేరే షూటింగ్స్‌ కారణంగా 'మణికర్ణిక'కు టైమ్‌ కేటాయించలేక, ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడని సినిమా టీమ్‌ బుకాయింపులకు దిగుతోంది. ఎంత బుకాయించినా సోనూ సూద్‌ 'మణికర్ణిక' నుంచి బయటకు రావడం వాస్తవం. 'మణికర్ణిక'ను కంగన తన కనుసన్నల్లో నడిపిస్తుండడం వాస్తవం. 

'మణికర్ణిక' క్రిష్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. దురదృష్టవశాత్తూ ఇదిప్పుడు కంగనా చేతిలో పడి, ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS