ఈమధ్య సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సోనూసూద్. తాను చేస్తున్న సామాజిక సేవలకు... దేశం మొత్తం ఫిదా అయిపోతోంది. `నువ్వు వెండి తెర మీద విలన్ వే. కానీ నిజ జీవితంలో రియల్ హీరోవి` అంటూ కీర్తిస్తున్నారు. అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకూ సాయం చేస్తున్న సోనూని దేవుడంటూ కీర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు సోనూసూద్ ఆస్తులెంత? అతనికి ఎన్ని కోట్లున్నాయి? అనే ఆసక్తికరమైన చర్చ వచ్చింది. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ అధ్యయనం చేయగా అతడి మొత్తం ఆస్తుల విలువ రూ. 130 కోట్లు అని తేల్చింది.
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సోనూ.. ఇదంతా కేవలం సినిమాల నుంచే సంపాదించాడు. ఈ కోవిడ్ కాలంలో.. దాదాపు 10 కోట్ల వరకూ వివిధ సేవాకార్యక్రమాలకు ఖర్చు పెట్టాడు. ఎవరికి సాయం కావాలన్నా నన్ను.. సంప్రదించండి అంటూ ఏకంగా ఓ టోల్ ఫ్రీ నెంబరునే ఇచ్చేశాడు. చిత్రసీమలో వందల వేల కోట్లున్న సెలబ్రెటీలు ఎంతో మంది. వాళ్లతో పోలిస్తే.. సోనూ సూద్ ఆస్తుల విలువ పిసరంత. అయినా సరే, సేవా గుణంలో మాత్రం అందరినీ మించిపోయాడు సోనూ. అందుకే.. జనమంతా ముక్తకంఠంతో హ్యాట్సాఫ్ సోనూ అంటున్నారు.