'అశ్వథ్థామ' చిత్రం మీద హీరో నాగశౌర్య ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. కొంత గ్యాప్ తర్వాత నాగ శౌర్య తన కొత్త సినిమాను ప్రకటించారు. విలువిద్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగశౌర్య ఒక ఆర్చర్ పాత్రలో ఇస్తున్నారు. #NS20 ఫస్ట్ లుక్ లో నాగశౌర్య సిక్స్ ప్యాక్ అవతారం, హెయిర్ స్టైల్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి.
తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమాకు భారీగా రూ. 25 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. నాగ శౌర్యకు పది పదిహేను కోట్ల లోపే మార్కెట్ ఉంది. అలాంటప్పుడు పాతిక కోట్లు పెట్టుబడి పెట్టడం అంటే ఓ రకంగా రిస్క్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా కథ మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలు భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారని సమాచారం. ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ ఉందని, ప్రేక్షకులను తప్పనిసరిగా మెప్పిస్తుంది అనే ఆలోచనతో నిర్మాతలు ఉన్నారట.
ఈ సినిమాలో నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. నూతన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను శరత్ మరార్.. నారాయణదాస్ కె. నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు