అమ్మా బొమ్మాళీ 'పశుపతి' మళ్లీ వస్తున్నాడమ్మాలీ.!

మరిన్ని వార్తలు

'అమ్మా బొమ్మాళీ పిందె పండయ్యిందే..' అంటూ 'అరుంధతి' సినిమాలో పశుపతి పాత్ర ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదో ట్రెండ్‌ అయిపోయింది ఆ టైంలో. సోనూసూద్‌ పోషించిన ఆ పాత్ర ఆయనకు విలన్‌ కేటగిరిలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చాలా కాలం పాటు పశుపతి అంటే సోనూసూద్‌, సోనూసూద్‌ అంటే పశుపతి అనేంతలా ఆ పాత్ర తాలూకు మార్క్‌ పడిపోయింది. అయితే తాజాగా సోనూసూద్‌ మరోసారి ఆ తరహా పాత్రలో అలరించబోతున్నాడనీ తెలుస్తోంది. 

 

ఏ సినిమా కోసమంటారా.? తేజ తెరకెక్కిస్తున్న 'సీత' సినిమా కోసం. ఈ సినిమాలో విలన్‌ పాత్ర అత్యంత కీలకమని తెలుస్తోంది. మామూలుగానే తేజ సినిమాల్లో విలన్‌ పాత్రలు ప్రత్యేకంగా అతి క్రూరంగా డిజైన్‌ చేయబడతాయి. ఈ సినిమాలో విలన్‌ పాత్ర కోసం మరింత ప్రత్యేక జాగ్రత్త తీసుకున్నాడనీ తెలుస్తోంది. ఎంత జాగ్రత్త అంటే, హీరో పాత్ర కన్నా విలన్‌ పాత్రే ఎక్కువ ఎలివేట్‌ అయ్యేంతలా అట. బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కాజల్‌ సీత పాత్ర పోషిస్తోంది. 

 

సీత అంటే మనకి ఓ ఐడియా ఉంది. కానీ మన ఐడియాలకి అందే సీత కాదీ సీత. సీత అంటే ఓర్పుకు కేరాఫ్‌ ఆడ్రస్‌. కష్టనష్టాలు ఆమె జీవితంతో సర్వ సాధారణం. కానీ తేజ సీత మాత్రం కష్టాలు పెట్టేదే కానీ, పడేది కాదట. అంత స్ట్రాంగ్‌గా ఈ క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశాడట తేజ. ఈ పాత్ర కోసం కాజల్‌ తన ఆటిట్యూడ్‌లో చాలా చాలా మార్పులు చేసుకుంటోందట. తన కెరీర్‌లోనే 'సీత' వెరీ స్పెషల్‌ మూవీ అవుతుందని కాజల్‌ భావిస్తోందట. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS