రూటు మార్చిన బెల్లంకొండ.?

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కి స్టార్‌డమ్‌తో అస్సలు పని లేదు. హిట్‌, ఫెయిల్యూర్‌తో కూడా సంబంధం లేదు. కానీ స్టార్‌ డైరెక్టర్లు, స్టార్‌ హీరోయిన్లను మాత్రం తన సినిమాల కోసం లాక్‌ చేసి ఉంచడంలో మనోడు ఘటికుడు. ఓ స్టార్‌ హీరో సినిమాకి ఉండాల్సిన అంతకు మించిన కమర్షియల్‌ హంగులన్నీ బెల్లంకొండ సినిమాల్లో చూసేయొచ్చు. ఇదిలా ఉంటే, మనోడు ప్రస్తుతం తేజ దర్శకత్వంలో 'సీత' సినిమాలో నటిస్తున్నాడు. కాజల్‌ అగర్వాల్‌ ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది. 

 

కాగా 'ఆర్‌ఎక్స్‌ 100'తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ అజయ్‌ భూపతి, బెల్లంకొండతో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. మామూలు రెగ్యులర్‌ కమర్షియల్‌ స్టోరీ కాదట ఇది. ఓ వినూత్న లవ్‌స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంచుకునే యోచనలో ఉన్నారట చిత్ర యూనిట్‌. ప్రస్తుతం సమంత విభిన్న స్టోరీలకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తోంది. డీ గ్లామర్‌ రోల్‌కైనా సై అంటోంది. ఆల్రెడీ డైరెక్టర్‌, స్టోరీలైన్‌ సమంతకు వినిపించాడనీ సమాచారమ్‌. 

 

స్టోరీ కాన్సెప్ట్‌ సమంతకు బాగా నచ్చేసిందట. దాదాపు ఓకే అని తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ తొలి చిత్రం 'అల్లుడు శీను'లో సమంత హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాకి సమంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్‌ అందుకుంది కూడా. అప్పటితో పోల్చితే సమంత స్టార్‌డమ్‌ ఇప్పుడు నెక్ట్స్‌ లెవల్‌లో ఉందని చెప్పాలి. సో ఇప్పుడు కూడా ఊహించని రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేసి సమంతను ఈ సినిమాకి ఎంపిక చేసుకునే యోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS