'అరవింద సమేత'లో లోకేష్‌ హీరో అయ్యుంటే.!

మరిన్ని వార్తలు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన 'అరవింద సమేత'లో హీరో ఎవరంటే ఎన్టీఆర్‌ అని తెలియని వారుండరు. అయితే లోకేష్‌ హీరోగా అరవింద సమేత ఎప్పుడొచ్చిందా.!! అని ఆశ్చర్యపోతున్నారా.? ఆ విషయానికే వచ్చేద్దాం. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో ఓ ఫోటో పోస్ట్‌ చేసి నారా లోకేష్‌ని 'అరవింద సమేత'లో హీరోగా ఊహించుకోగలరా.? ఒక్కసారి ఊహించుకోండి అని చెప్పి ఈ ఫోటో పోస్ట్‌ చేశారు. 

 

ఇంతకీ వర్మ ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాని అడ్డుకునేందుకు తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆ ప్రయత్నం చేస్తున్నది ఇంకెవరో కాదు, తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు కుమారుడైన నారా లోకేష్‌. ఈ ప్రస్థావన తెస్తూ, వర్మ తాజా ఫోటో పోస్ట్‌ చేసి, ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తున్నాడు. అంతేకాదు, నారా లోకేష్‌ హీరోగా అరవింద సమేత తెరకెక్కించి ఉంటే మూడు రెట్లు అధికంగా వసూళ్లు వచ్చేవని ఆయన సెటైర్‌ వేశారు. 

 

అంతటితో ఆగలేదు. నారా లోకేష్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కన్నా మంచి నటుడనీ, భాషా ప్రావీణ్యం ఆయనకు బాగా ఉందనీ, తెలుగు ఉచ్ఛారణలో ఆయనకు ఆయనే సాటి అని అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి టైం వేస్ట్‌ చేసుకుంటున్నారనీ, సినిమాల్లో ఉంటే స్టార్‌ హీరోలను తలదన్నే గొప్ప హీరో అవుతాడంటూ, వరుసపెట్టి సెటైరికల్‌గా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు రామ్‌గోపాల్‌ వర్మ. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS