ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక గొప్ప గాయకుడిగానే కాకుండా ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళని ఓ వివాదరహితుడిగా ఫిలిం ఇండస్ట్రీలో మంచిపేరు ఉంది.
అలాంటి ఆయనకు, ఇళయరాజా నుండి కాపీరైట్ కి సంబంధించి లీగల్ నోటీసులు అందడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వివరాల్లోకి వెళితే, బాలు తన సినీ ప్రస్థానం 50 ఏండ్లు పూర్తయిన సందర్భంలో SPB50 పేరుతో అమెరికాలో షోస్ చేస్తున్నారు.
ఆ తరుణంలో, తన అనుమతి లేకుండా తన పాటలు పాడుతున్నందుకు కోర్ట్ సమన్లు పంపించాడు. దీని పై బాలు స్పందిస్తూ, ఇలా నోటీసులు పంపడం వల్ల తాను చాలా భాదపడుతున్నానని. అయితే తన మిత్రుడు కోర్టు ద్వారా ముందుకు వెళ్ళాడు కాబట్టి, తాను కూడా కోర్టు ద్వారానే సమాధానం చెబుతానని స్పష్టంచేశాడు.
అదే సమయంలో ఈ సంఘటన తమ మద్య ఉన్న స్నేహం పై ఎటువంటి ప్రభావం చూపదని తెలిపాడు.