బాలు ఆరోగ్యం గురించి సర్వత్రా... ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆయన ఎలా ఉన్నారు? ఎప్పుడు కోలుకుంటారు? అంటూ అభిమానులు అను నిత్యం ఆరా తీస్తూనే ఉన్నారు. పూజలు, హోమాలూ చేస్తున్నారు. వాళ్లందరికీ శుభవార్త. బాలు ఇప్పుడు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. చాలా రోజుల తరవాత ఆయన స్పృహలోకి వచ్చారు. కళ్లు తెరచారు. మనుషుల్ని గుర్తు పడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు ఎస్.పి.చరణ్ తెలిపారు. చాలా రోజుత తరవాత ఐసీయూ గదిలోకి వెళ్లానని, నాన్నగారు తనని చూసి గుర్తు పట్టారని, అమ్మ ఎలా వుంది? నువ్వు ఎలా ఉన్నావు అని అడిగారని... చరణ్ ఆ వీడియోలో తెలిపారు.
``మీ అందరు చేస్తున్న పూజల గురించి చెప్పాను. ప్రసాదం ఇచ్చాను. ఆయన బొటన వేలు పైకెత్తి చూపించారు. యోగక్షేమాలు సైగల ద్వారా అడిగారు. సంగీతం వినిపించాం. ఆయన స్పందించారు. ఆయన త్వరగా కోలుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి వస్తాడని నమ్మకం ఉంది`` అన్నారు.