ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెల్లమెల్లగా కుదుట పడుతోంది. ఈనెల 5న ఆయన కరోనా బారీన పడి, ఆసుపత్రిలో చేరడం, శుక్రవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో, వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించడం తెలిసిన విషయాలే. దాంతో.. బాలు ఆరోగ్యం గురించి ఆదోంళన చెందారు అభిమానులంతా.
బాలు ఆరోగ్యం క్రమంగా కుదుట పడుతోందని వైద్యులు చెప్పారు. నిన్నటితో పోలిస్తే.. ఆయన ఆరోగ్యం కొంచెం మెరుగయ్యిందని, చికిత్సకు స్పందిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని ఎస్.పి.చరణ్ కోరారు. ఆసుపత్రి పడకపై పడుకున్న బాలు.. చేతిని పైకెత్తి, బొటన వేలు చూపిస్తున్న ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, బాలు కోలుకుంటున్నారు అనడానికి అది నిదర్శనం అని.. అభిమానులు భావిస్తున్నారు.