పొడిచేస్తా.. పీకేస్తా.. అంంటూ బిగ్‌హౌస్‌లో కుమార్ సాయి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ‘ఇకపై ప్రతి వారం అబిజీత్‌ని నామినేట్ చేస్తా..’ అని స్వయంగా బిగ్ హోస్ట్ కింగ్ నాగార్జునతోనే చెప్పిన కుమార్ సాయి, నిజానికి గత వారమే హౌస్ నుంచి ఎవిక్ట్ అయిపోవాల్సి వుంది. కానీ, అనూహ్యంగా దేవి నాగవల్లిని బయటకు పంపేశారు. ఆ తర్వాత కూడా హౌస్‌లో కుమార్ సాయి ప్రవర్తన ఏమాత్రం మారలేదు. ఎవరితోనూ సరిగ్గా కలవడంలేదన్న విమర్శల్ని ఎదుర్కొంటూనే వున్నాడు.. ఈ కారణంతోనే అతను ఈ వారం కూడా ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నామినేట్ అయ్యాడు.
గత వారం ఎలాగోలా సేవ్ అయిన కుమార్ సాయి, ఈ వారం మాత్రం ఎలిమినేట్ అవడం ఖాయమంటున్నారు. ఏదో అద్భుతం జరిగితే తప్ప, ఈ వారం కుమార్ సాయి గట్టెక్కలేడన్నది మెజార్టీ బిగ్‌బాస్ వ్యూయర్స్ అభిప్రాయం. మరోపక్క, మెహబూబ్ దిల్ సే కూడా ఎలిమినేషన్ రేసులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇక, అలేఖ్య హారిక పట్ల కూడా నెగెటివిటీ పెరిగిపోతోంది. కాగా, ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియ గందరగోళంగా సాగింది.
కంటెస్టెంట్స్ సరైన రీజన్ లేకుండా తోటి హౌస్‌మేట్స్‌ని నామినేట్ చేయడం బిగ్‌బాస్ వ్యూయర్స్‌కి అస్సలు నచ్చడంలేదు. ‘మేం వేస్తున్న ఓట్లతో సంబంధం లేకుండా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి’ అన్న కంప్లయింట్ బిగ్‌బాస్ వ్యూయర్స్ నుంచి ప్రధానంగా వినిపిస్తోంది.