సినీ నటి రోజా రెండోసారి నగరి ఎమ్మెల్యేగా వైసీపీ నుండి విజయం సాధించారు. ఆమెకి మంత్రి పదవి ఎప్పుడో ఖాయమైపోయింది. అయితే, కొత్తగా ఓ గాసిప్ తెరపైకొచ్చింది. అదేంటంటే, స్పీకర్‌గా రోజాకి అవకాశమివ్వాలని వైఎస్ జగన్ భావిస్తున్నారట. రోజా కూడా స్పీకర్ పదవి పట్ల కొంత ఆశక్తిగానే ఉన్నారనీ సమాచారమ్. గత ఐదేళ్లుగా ఆమె అసెంబ్లీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అదే అసెంబ్లీలో ఆమెకు అరుదైన గౌరవం ఇవ్వాలని వైఎస్ జగన్ సహా పార్టీ ముఖ్య నేతలంతా భావిస్తున్నారట. మరో పక్క స్పీకర్ పదవి కంటే, మంత్రి పదవే మేలని రోజాకి ఆమె సన్నిహితులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో తొలిసారిగా ఆమె ఎమ్మెల్యే అయ్యారు.
అసెంబ్లీలో 'అధ్యక్షా..!' అనేందుకు ఆమె ఎంతో ఆశపడ్డారు. కానీ, అసెంబ్లీ నుండి బహిష్కరించి చంద్రబాబు ప్రభుత్వం ఆమెపై చాలా కుట్రలు చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి పదవా.? స్పీకర్ పదవా.? అనే విషయమై రోజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. వైసీపీ అధినేత జగన్ రోజాకి ఎలాంటి పదవి కట్టబెడతారో వేచి చూడాలి.