మహేష్ బాబు తాజా చిత్రం స్పైడర్ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది.
ఇక మొదటి షో నుండే మిక్స్డ టాక్ వచ్చినప్పటికి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం తన సత్తా చాటుకుంది. స్పైడర్ మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ 37కోట్ల మేర వసూళ్ళు ఆర్జించింది. ఈ మొత్తంలో స్పైడర్ చిత్రానికి ఓవర్సీస్ లోనే కలెక్షన్స్ ఎక్కువగా వచ్చినట్టు సమాచారం.
ఓవర్సీస్ లో మహేష్ చిత్రాలకు ఆదరణ బాగా ఎక్కువగా ఉండడంతో ఈ చిత్రానికి మొదటిరోజు కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈరెండు మూడు రోజుల సెలవులు కావడంతో కలెక్షన్స్ పరంగా ఈ చిత్రానికి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండబోవు అని అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
చూద్దాం.. బాక్స్ ఆఫీస్ వద్ద మహేష్ స్టామినా ఎంతవరకు ఉండబోతుందో..