అక్షయ్ కుమార్ నటించిన టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథ చిత్రం ఈ మధ్యనే విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సైతం మూటగట్టుకోగలిగింది. ఈ చిత్రం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చారు అన్న కారణంగా చాలా రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ నుండి మినహాయింపు కూడా దక్కింది.
ఇదిలావుంటే భారత ప్రభుత్వం ఈ చిత్రంలోని మంచి సందేశాన్ని అందరికి చేరే ఉద్దేశ్యంతో దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ చిత్ర ప్రదర్శన చేయాలనీ నిర్ణయించారు. దీనితో అక్టోబర్ 2, గాంధీ జయంతి పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ చిత్ర ప్రదర్శన జరగనుంది.
ఈ చిత్రాన్ని ప్రదర్శించడం ద్వారా బహిరంగ ప్రదేశాల్లో మల,మూత్ర విసర్జన చేసే వారిని నియంత్రించాలని భావిస్తున్నారు. ఇక ఇటువంటి గొప్ప గుర్తింపు రావడంతో సదరు చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది.