ఓ చిన్న సినిమా విడుదలకు ముందే లాభాలు చవిచూసిందంటే ఈ రోజుల్లో గొప్ప విషయమనే చెప్పుకోవాలి. టేబుల్ ప్రాఫిట్‌తో రిలీజ్‌కి ముందే నిర్మాత బయటపడ్డాడంటే - అది ఓ మ్యాజిక్కే. `తిప్పరా మీసం` విషయంలో ఇదే జరిగింది. శ్రీవిష్ఱు కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. వచ్చే నెలలో విడుదల కాబోతోంది. ఇప్పటికే బిజినెస్ పూర్తయింది. రైట్స్ రూపంలో ఈ సినిమాకి 7.5 కోట్లు వచ్చాయి.
అంటే.. టేబల్ ప్రాఫిట్ అన్నమాట. విజయ్ కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా ఇది. థియేటరికల్ రైట్స్ రూపంలో 3.25 కోట్లు రాబట్టింది. హిందీ డబ్బింగ్ కి 1.75 కోట్లు వచ్చాయి. శాటిలైట్ పరంగా మరో 2.5 కోట్లు దక్కాయి. అయితే ఈ సినిమా కేవలం 4 కోట్లతో పూర్తయిందట. అంటే... 3.5 కోట్లు లాభం. ఇటీవల శ్రీవిష్ణు `బ్రోచేవారెవరురా`తో మంచి విజయాన్ని అందుకున్నాడు. అందుకే తిప్పరా మీసంకి కాసుల వర్షం కురిసింది.