ఇంట్రెస్టింగ్‌గా శ్రీ విష్ణు 'తిప్పరా మీసం'.!

By iQlikMovies - February 06, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

విలక్షణ నటుడు శ్రీవిష్ణు త్వరలో 'తిప్పరా మీసం' సినిమాతో రాబోతున్నాడు. కథలో కొత్తదనం ఉంటే, హీరోగానే కాకుండా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ నటించేందుకు శ్రీవిష్ణు ముందుంటాడు. తాను ఎంచుకున్న పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. నేచురల్‌ యాక్టింగ్‌తో ప్రత్యేకమైన అభిమానం సంపాదించుకున్నాడు. తాజాగా కృష్ణ విజయ్‌ దర్శకత్వంలో 'తిప్పరా మీసం' అనే సినిమాలో నటిస్తున్నాడు. 

 

'చీకటి గదిలో చితక్కొట్టుడు' ఫేం నిక్కీ తంబోలీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా టైటిల్‌ని కన్‌ఫామ్‌ చేస్తూ చిత్ర యూనిట్‌ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. గతంలో ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇంతవరకూ శ్రీవిష్ణు పోషించిన పాత్రలన్నింట్లోకీ విభిన్నమైన పాత్ర ఇది. గెటప్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. గుబురు గెడ్డం, మీసాలు, కండలు తీరిన దేహంతో రగ్గ్‌డ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. 

 

తాజా పోస్టర్‌ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. గెడ్డం, మీసాలతో పాటు, కళ్లకు పెట్టుకున్న కళ్లజోడు ఓ వైపు పగిలిన అద్దంతో ఫన్నీగా అనిపిస్తోంది. అయితే ఒక రకంగా ఈ లుక్‌ని ఫన్నీ యాంగిల్‌లోనూ, మరోవైపు సీరియస్‌ మోడ్‌లోనూ కూడా తీసుకోవాలి. లుక్‌ పరంగా అంత సీరియస్‌గా కనిపిస్తున్నాడు శ్రీవిష్ణు. ఇంతకీ ఎందుకు శ్రీవిష్ణు ఈ సినిమా కోసం ఇంతలా గెడ్డాలు మీసాలు పెంచేయాల్సి వచ్చిందో తెలియాలంటే లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS