త్రివిక్రమ్ సినిమా అంటే సెకండ్ హీరోయిన్ పాత్ర తప్పనిసరిగా మారింది. పార్వతి మెల్టన్, ప్రణిత సుభాస్, ఇషారెబ్బా, నివేదా పెతురాజ్ .. వీళ్ళంతా త్రివిక్రమ్ సెకెండ్ హీరోయిన్లే. ఇప్పుడు శ్రీలీల కూడా ఆ ఖాతాలో చేరింది. మహేష్ బాబు - త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా రానుంది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్. ఈ సినిమా సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కూడా వుంది. దీని కోసం శ్రీలీలాని తీసుకున్నారు.
అయితే ఈ ఆఫర్ ని మొదట శ్రీలీలా రిజెక్ట్ చేసిందట. తక్కువ స్క్రీన్ స్పేష్ తో పాటు తన పాత్రకి అంత ప్రాధాన్యత లేదని భావించిన శ్రీలీల, ఈ సినిమా తన కెరీర్ కి మైనస్ అయ్యే అవకాశం వుందని సున్నితంగానే నో చెప్పిందట. అయితే త్రివిక్రమ్ మళ్ళీ తన పెన్నుకి పని చెప్పి ఆమె సీన్లు పెంచారు. అలాగే ఒక పాటలో కూడా యాడ్ చేశారు. దీంతో మళ్ళీ సినిమాలోకి వచ్చింది శ్రీలీల. ఇందులో మహేష్ బాబుకి ఫ్రండ్ గా కనిపించనుందామె. సర్కారు వారి పాట తర్వాత మహేష్ చేయబోయే సినిమా ఇదే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.