బిగ్‌బాస్ రన్ అయినంత కాలం ఎక్కువ స్క్రీన్ స్పేస్‌తో శ్రీముఖి మ్యాగ్జిమమ్ ప్లేస్ ఆక్యుపై చేసింది. హౌస్‌లో స్క్రీన్ స్పేస్‌తో పాటు, న్యూస్‌లోనూ ఆమెదే ఎక్కువ స్పేస్. ఇప్పుడు రన్నరప్‌గా నిలిచి కూడా ఎక్కువ డిస్కషన్స్‌లో నిలుస్తోంది. ఫినాలే డేకి బిగ్‌బాస్ స్టేజ్‌పై మెగాస్టార్ చిరంజీవి, మన్మధుడు నాగార్జున ఉన్నప్పటికీ, ఏమాత్రం భయమూ, బెరుకూ ఆ మాటకొస్తే, ఉన్నతమైన సంస్కారం లేకుండా ఆటిట్యూడ్ చూపించే ప్రయత్నం చేసింది.. అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను ఊదరగొట్టేస్తున్నారు.
అయినా శ్రీముఖి కూడా ఏం తక్కువ తినలేదు. వారి వాదనలను తెలివిగా ఎదుర్కొంటోంది. బిగ్‌బాస్ ట్రోఫీ తనదే అని 100 పర్సెంట్ నమ్మకంతో ఉన్న శ్రీముఖికి క్లైమాక్స్‌లో సీను రివర్స్ అయ్యేసరికి దిమ్మ తిరిగిపోయింది. ఏం మాట్లాడుతుందో తనకే తెలియనంతగా చంద్రముఖి ఆవహించిన జ్యోతికను సూపర్ స్టార్ రజనీకాంత్ శాంత పరిచినట్లుగా, పక్కనే ఉండి, ఆమె ఫ్రస్టేషన్‌ని గమనించిన మెగాస్టార్ చిరంజీవి ఆ టైమ్‌లో ఆమెను చల్లార్చే ప్రయత్నం చేశారు. లేదంటే, శ్రీముఖి అలియాస్ చంద్రముఖి ఆ స్టేజ్‌పై ఇంకేం చేసేసేదో తెలియని పరిస్థితి.
ట్రోఫీ మాత్రమే రాహుల్‌కి దక్కింది. కానీ, నువ్వు కోట్లాది అభిమానులు హృదయాల్ని కొల్లగొట్టావ్.. అంటూ తీర్ధం చల్లే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా బిగ్‌బాస్ షో ముగిసిపోయినా శ్రీముఖి హవా మాత్రం నెట్టింట్లో కొనసాగుతూనే ఉంది. అది నెగిటివ్ అయినా, పోజిటివ్ అయినా.