ఓడినా శ్రీముఖి తగ్గట్లేదు!

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 టైటిల్‌ రాహుల్‌ సొంతమైంది. ఫైనల్‌ పోరు ఊహించని విధంగానే జరిగింది. టాప్‌ 5లో ఉన్న అలీ రెజా, వరుణ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖి, రాహుల్‌ ఈ ఐదుగురి నుండీ వరుసగా ఒక్కొక్కరూ బయటికి వచ్చేశారు. చివరికి రాహుల్‌, శ్రీముఖి మిగిలారు. హౌస్‌లోకి వెళ్లే ముందు వరకూ రాహుల్‌ తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అని చెప్పింది శ్రీముఖి. హౌస్‌లోకి వెళ్లాక కూడా అదే చెప్పింది. కానీ, హౌస్‌లో ఉన్నంత కాలం రాహుల్‌ని ఎనిమీలానే చూసింది. బహుశా ఫైనల్‌ పోరు వారిద్దరి మధ్యనే ఉండబోతుందని శ్రీముఖికి ముందే తెలిసిపోయి ఉంటుంది.

 

బిగ్‌బాస్‌లో గెలుపోటములు సహజమే. ఎవరెన్ని రోజులు ఉంటారనేది ఆడియన్స్‌ చేతుల్లో ఉంటుంది. అలాంటిది అన్ని లెక్కల్ని బేరీజు వేయగల శ్రీముఖి ఓటమిని తాను అంగీకరించనని చెప్పింది. ఓడినా నేనే విన్నర్‌ అన్నట్లుగా ఫీలయ్యింది. ఓటమి తనకు నచ్చదంది. విన్‌ అయిన రాహుల్‌ని జస్ట్‌ ఫార్మల్‌గా కూడా అభినందించలేదు శ్రీముఖి. నా ఫ్రెండే గెలిచాడు కదా.. అని రాహుల్‌ని అభినందించి ఉంటే బావుండేది. కానీ, శ్రీముఖి అలా చేయకపోవడం, మినిమమ్‌ ఫార్మాలిటీని శ్రీముఖి మిస్‌ అయ్యిందంటూ సోషల్‌ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. ఏది ఏమైతేనేం, ఓడినా శ్రీముఖి ఏమాత్రం తగ్గలేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS