అక్టోబర్ 2న మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు సౌత్ నుండి మరే సినిమా 'సైరా'కి పోటీ లేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం 'వార్' తప్పేలా లేదు. అదేనండీ, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన 'వార్' సినిమా అదే రోజు విడుదల కాబోతోంది. రెండూ యాక్షన్ బేస్‌డ్ మూవీసే. కానీ 'సైరా' చారిత్రాత్మక చిత్రం. 'వార్' స్టైలిష్ అండ్ కమర్షియల్ యాక్షన్ మూవీ. బడ్జెట్ పరంగా రెండూ భారీ చిత్రాలే.
కథనం పరంగా రెండూ డిఫరెంట్ వేరియేషన్ మూవీస్ కానీ, బాక్సాఫీస్ యాంగిల్ నుండి చూస్తే, ఈ రెండు భారీ చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు తలపడడం సబబు కాదనే నేపథ్యంలో 'సైరా' కోసం 'వార్'ని పోస్ట్‌పోన్ చేసుకోవాలని 'సైరా' టీమ్ 'వార్' టీమ్‌తో మంతనాలు చేస్తోందట. అయితే, 'వార్' టీమ్ కూడా వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే 'సాహో' కోసం కొన్ని బాలీవుడ్ చిత్రాలు వాయిదా పడ్డాయి. మళ్లీ ఓ తెలుగు సినిమా కోసం తమ సినిమాని వాయిదా వేసుకునే సిట్యువేషన్ సైరా రూపంలో వచ్చింది.
ఈ పరిస్థితిని బాలీవుడ్ ఎలా ఎదుర్కొంటుందో ఏమో కానీ, 'సైరా'పై బాలీవుడ్ బాక్సాఫీస్ కూడా బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. సో ఆ యాంగిల్ నుండి చూస్తే, వెనక్కి తగ్గక తప్పేలా లేదు. చూడాలి మరి, 'సైరా'తో 'వార్' బరిలోకి దిగుతుందా.? లేక 'సర్దుకుపోవాలి' అన్న చందంగా వెనక్కి తగ్గుతుందా.? వేచి చూడాలిక.