బుల్లి తెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. వరుస ఎలిమినేషన్ల తో ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ షో లో నేడు సావిత్రక్క పుణ్యమా అని ఏకంగా హౌస్ మొత్తం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యింది. అయితే హౌస్ లో ఎప్పుడు తన ఎనర్జీ తో ఆకట్టుకుంటున్న శ్రీముఖి కి నిన్న తన తండ్రి 'రామ్ కిషన్' సర్ప్రైజ్ ఇచ్చాడు.
క్రిందటి వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ లో శ్రీముఖి తన తండ్రి గురించి చెప్పిన మాటలకు భావోద్వేగానికి గురైన 'రామ్ కిషన్' శ్రీముఖి కి 'అల్ ది బెస్ట్' చెబుతూ ఒక వీడియో మెసేజ్ శ్రీముఖి సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. తనకు శ్రీముఖి రాకతోనే అదృష్టం వరించిందనీ, తను ఎప్పుడో విన్నర్ అయిపోయిందని.. తన గురించి అంత గొప్పగా చెప్పి తన తల మీద పెద్ద కిరీటం పెట్టిందని 'రామ్ కిషన్' ఈ వీడియో లో చెప్పాడు. తండ్రి ఆశీస్సులతో శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి మరి.