బుల్లి తెరపై స్టార్ గా చలామణీ అవుతోంది శ్రీముఖి. తనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క రోజు.. ఒక్క పూట కూడా శ్రీముఖి ఖాళీగా ఉండదు. చేతి నిండా అన్ని షోలు ఉన్నాయి. తన ప్రేమ, పెళ్లి మేటర్లు కూడా తరచూ బయటకు వస్తుంటాయి. ఫలానా వాళ్లతో డేటింగ్‌లో ఉందని, త్వరలో పెళ్లని చెప్పుకొంటూ ఉంటారు. ఇప్పుడు అదే నిజం కాబోతోంది. త్వరలోనే శ్రీముఖి పెళ్లి పీటలు ఎక్కబోతోందట.
ఓ బిజినెస్ మాగ్నెట్‌తో శ్రీముఖి లవ్ లోఉందని, తనని పెళ్లి చేసుకోబోతోందని ఇన్ సైడ్ వర్గాల టాక్. అతి త్వరలోనే శ్రీముఖి పెళ్లి చేసుకోబోతోందని, అఫీషియల్ గా శ్రీముఖినే ఈ విషయాన్ని ప్రకటిస్తుందని చెప్పుకొంటున్నారు. సోషల్ మీడియాలో శ్రీముఖి చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. అదే వేదికపై శ్రీముఖి పెళ్లి కబురు వినే ఛాన్స్ ఉంది. బుల్లి తెర భామల్లో చాలామంది పెళ్లి ఇలా స్వీట్ సర్‌ప్రైజ్‌లా జరిగిపోయినవే.
చాలామంది లవ్ మేరేజ్‌లే చేసుకొన్నారు. రష్మి - సుధీర్ ప్రేమ వ్యవహారంపై కూడా చాలా కాలంగా వార్తలొచ్చాయి. కానీ వాళ్లు ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. పెళ్లి మాట అస్సలు ఎత్తడం లేదు. వాళ్లకంటే తరవాత వచ్చిన శ్రీముఖిలాంటి వాళ్లు మాత్రం పెళ్లి విషయంలో స్పీడు స్పీడుగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు.