బిగ్‌బాస్ గేమ్‌లో భాగంగా ఇచ్చే టాస్క్‌లను వినోదాత్మకంగా పూర్తి చేయమంటారు. కానీ, ఫిజికల్ అటాక్స్ చేయమనీ, వైల్డ్‌గా బిహేవ్ చేయమనీ కాదు. ఆ సంగతి హౌస్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడే హౌస్‌మేట్స్‌కి సూచిస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో విచక్షణ కోల్పోతుంటారు హౌస్ మేట్స్. అలా హౌస్‌లో దొంగా పోలీస్ టాస్క్‌కి సంబంధించి, శ్రీముఖి, రవి కృష్ణ విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. టాస్క్‌లో భాగంగా డంబెల్‌తో నిధి అద్దాలను పగల గొట్టడంతో, అనవసరంగా రవి కృష్ణ గాయాల పాలు కావడమే కాకుండా, కష్టపడి చేసిన టాస్క్ కూడా రద్దయిపోయింది.
శ్రీముఖి చేసిన ఈ పిచ్చి పని వల్ల హౌస్ మేట్స్ ఆగ్రహానికి గురి కావడంతో పాటు, బిగ్‌బాస్ ఆగ్రహానికి కూడా గురి కావల్సి వచ్చింది. హౌస్‌మేట్స్ అందరిలోనూ రాహుల్, శ్రీముఖిని మరింత ఎక్కువగా ఛీదరించాడు. చివాట్లు పెట్టాడు. నీ యాంకరింగ్‌లోని పిచ్చితనం ఇక్కడ చూపించావ్.. అంటూ పర్సనల్‌గా నిందించాడు.
ఇక చేసిన తప్పుకు రవి కృష్ణ చేతికి గాయంతో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక ఈ తప్పులో మరో నిందితురాలిగా ఉన్న శ్రీముఖిని బిగ్‌బాస్ వచ్చే వారానికి డైరెక్ట్‌గా నామినేట్ చేశారు. ఇది హౌస్‌లో ఎవరూ ఊహించని పరిణామం. అయితే, తప్పు చేసి, శ్రీముఖి ఆ తప్పును బుకాయించేందుకు ప్రయత్నం చేసింది. కానీ, బిగ్‌బాస్ దగ్గర ఆమె టాలెంట్ చెల్లలేదు మరి.