బిగ్ బాస్ షోకి అదనపు గ్లామర్ తీసుకొచ్చింది శ్రీముఖి. పటాస్ లాంటి పోగ్రామ్స్ తో బుల్లి తెరపై పాపులర్ అయిన శ్రీముఖి బిగ్ బాస్ లో కనిపించేసరికి ... ఈ షో క్రేజ్ ఇంకాస్త పెరిగింది. షో చివరి వరకూ ఉండగలిగే కంటెస్టెంట్స్ లో తన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ షో లో అందరికంటే ఎక్కువ పారితోషికం అందుకుంటున్నది కూడా తనేనని టాక్. బుల్లి తెరపై ఒక్క ఎపిసోడ్ చేస్తేనే శ్రీముఖికి 40 నుంచి 50 వేల వరకూ ముడుతుంది.
ఎంతకాదన్నా.. నెలకు 50 లక్షలు సంపాదించుకోగలదు. అందుకే బిగ్ బాస్ కోసం భారీ మొత్తమే డిమాండ్ చేసిందని టాక్. బిగ్ బాస్ లో పారితోషికాలు ఇచ్చే విధానం వేరుగా ఉంటుంది. ఎన్ని రోజులు ఎక్కువగా ఉంటే, అంత పారితోషికం అన్నట్టు. అంటే ఓ విధంగా చెప్పాలంటే రోజు వారీ కూలీ అన్నమాట. అలా శ్రీముఖికి రోజుకి లక్ష రూపాయలు ఇవ్వడానికి బిగ్ బాస్ యాజమాన్యం సిద్ధమైంది.
బిగ్ బాస్ విజేతగా నిలిస్తే పారితోషికానికి ఇది అదనం అన్నమాట. ఒకవేళ శ్రీముఖి నెల రోజులు ఉండి వచ్చేసిందనుకోండి. రోజుకి లక్ష చెప్పున తనకు రూ.30 లక్షలు ముడతాయన్నమాట. శ్రీముఖి తరవాత అంత పారితోషికం అందుకుంటోంది వరుణ్ సందేశ్, రితికల జోడీ అని తెలిసింది. వీరిద్దరికీ ఎలాగూ సినిమాలు లేవు. కాబట్టి... పెద్దగా డిమాండ్ చేయలేరు కూడా. కానీ.. వాళ్లకీ బాగానే ముడితోందని టాక్.