డే వన్ నుండీ శ్రీముఖి స్పెషల్‌గా గేమ్ ప్లాన్ చేసుకుంటూ వస్తోంది. బయటి స్క్రీన్‌లో శ్రీముఖికీ, బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న శ్రీముఖికీ అస్సలు పొంతనే లేదు.. అనేలా వ్యవహరిస్తోంది. లో టోన్‌తో హౌస్‌లో అందరి మనసుల్నీ గెలుచుకున్నట్లు కనిపించింది. అయితే, ఇదంతా తొలి రెండు రోజుల వ్యవహారం మాత్రమే. ఆ తర్వాతి నుండీ సీన్ రివర్స్ అయిపోయింది. అందరి మనసుల్ని గెలుచుకోవడం కాదు, అందరి మనసుల్లోనూ శ్రీముఖి పట్ల వ్యతిరేకత ఏర్పడిపోయింది. కొందరు బయట పడుతున్నారు.
ఇంకొందరు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ హిమజ, రాహుల్‌తో శ్రీముఖికి కొంత క్లాష్ వచ్చింది. నామినేషన్స్‌లో భాగంగా పునర్నవి కూడా శ్రీముఖిని వ్యతిరేకించింది. అలా ఐదుగురు కంటెస్టెంట్స్ శ్రీముఖి పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఇక తాజాగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి కూడా శ్రీముఖిపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.
మొదట్లో బాగా ఆడిన శ్రీముఖి, ఇప్పుడు స్లో అయిపోయింది. ఆమెకు అంత సీన్ లేదని తేల్చేసింది. హౌస్ బయట నుండి చూసినప్పుడున్న ఎక్స్‌పెక్టేషన్స్ ఇప్పుడు ఆమెలో లేవని తమన్నా వ్యాఖ్యానించింది. తమన్నా మాటలకు జాఫర్, మహేష్ వంత పాడడంతో, బిగ్‌బాస్‌లో శ్రీముఖి వ్యతిరేకుల సంఖ్య మరింత పెరిగినట్లయ్యింది. సో చూడాలి మరి, ఈ వ్యతిరేకత నుండి శ్రీముఖి ఎలా గట్టెక్కుతుందో. తన గేమ్ స్ట్రాటజీని ఎలా ఛేంజ్ చేసుకుంటుందో.