శ్రీముఖి ఆర్మీ రగిలిపోతోందక్కడ.

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో జనానికి ఒరిగేదేముంది? జనంలో ఉత్కంఠ రేపడం.. తద్వారా టీఆర్పీ రేటింగులు పెంచుకోవడం.. ఇదే అసలు విషయం. హౌస్‌ మేట్స్‌ మధ్య చిచ్చు పెట్టి చోద్యం చూడటం బిగ్‌బాస్‌ పని. ఆ తర్వాత హౌస్‌ మేట్స్‌ నానా రకాలుగా తిట్టుకుంటారు. ఎంత తిట్టుకున్నా, కొన్నాళ్ళ పాటు ఒకే ఇంట్లో వుండాలి కాబట్టి.. ఆ తర్వాత కలిసిపోతారు. అయితే, తిట్టుకున్న విషయాలే బయటకొస్తాయి. కలుసుకున్న విషయాలు చాలా అరుదుగానే కన్పిస్తాయి.

 

ఆ సంగతి పక్కన పెడితే, అనూహ్యంగా శ్రీముఖి ఇమేజ్‌ డ్యామేజీ అయిపోయింది.. హేమ ఎలిమినేషన్‌ తర్వాత. క్రమక్రమంగా హౌస్‌లో ఆమెకు ఇంపార్టెన్స్‌ తగ్గుతోందన్న విషయాన్ని శ్రీముఖి ఆర్మీ పసిగట్టింది. పక్కాగా బ్యాక్‌ ఎండ్‌ టీమ్‌ని కంటెస్టెంట్స్‌ ఈసారి సిద్ధం చేసుకున్న విషయం విదితమే. అలా శ్రీముఖి బ్యాక్‌ అండ్‌ టీమ్‌ కూడా ఒకింత అగ్రెసివ్‌గా మారిందిప్పుడు. ఐదు ఓట్లతో శ్రీముఖి ఎలిమినేషన్స్‌కి సంబంధించి నామినేట్‌ అవడంతో, శ్రీముఖి ఆర్మీ రగిలిపోతోంది. సోషల్‌ మీడియా వేదికగా ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతూ, శ్రీముఖి పట్ల సింపతీ తీసుకొచ్చేందుకు శ్రీముఖి ఆర్మీ ప్రయత్నిస్తోంది.

గతంలో కౌశల్‌ మండా ఇలాగే బ్యాక్‌ అండ్‌ టీమ్‌తో గట్టెక్కాడు. అయితే, అప్పట్లో ఇంత ఆర్గనైజ్డ్‌ టీమ్స్‌ ముందస్తుగా ప్రిపేర్‌ అయి లేవు. అయినా, కౌశల్‌ దుమ్ము రేపేశాడు. హౌస్‌లో ఎన్నెన్ని దారుణాలు కౌశల్‌కి వ్యతిరేకంగా జరిగినా, కౌశల్‌ ఆర్మీనే అతన్ని కాపాడింది. మరి, ఇప్పుడు శ్రీముఖిని ఆ ఆర్మీ కాపాడుతుందా? ఏమోగానీ, భారీ స్థాయిలో సేవా కార్యక్రమాల్లాంటివి శ్రీముఖి ఆర్మీ ప్లాన్‌ చేస్తోందన్న ప్రచారం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS