ఇటీవల యూట్యూబ్ లో టీజర్ తోనే సంచలనాలు క్రియేట్ చేసిన ఏడుచేపల కథ లో టెంప్ట్ రవి గా దూసుకుపోయిన అభిషేక్ రెడ్డి, సాక్షి నిదియా జంటగా, ఏడు చేపల కథ చిత్ర నిర్మాతల్లో ఒకరైన జి.చరితా రెడ్డి నిర్మాతగా లక్ష్మి చరిత ఆర్ట్స్ మరియు జిఎస్ఎస్‌పికె స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో రేష్మి హీరోయిన్ గా అంతం అనే చిత్రానికి దర్శకత్వం వహించిన జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ దర్శకుడిగా నిర్మిస్తున్న చిత్రం వైఫ్,ఐ. ఈ చిత్రానికి నైఫ్ బెటర్ దెన్ వైఫ్ అనే క్యాప్షన్ ని పెట్టారు.. ఈ చిత్రం టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాన్సెప్ట్ రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.
ఈ సందర్బంగా దర్శకుడు జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్ మాట్లాడుతూ.. గతం లో నేను దర్శకత్వం వహించిన అంతం చిత్రం కమర్షియల్ గా చాలా మంచి విజయాన్ని సాధించింది. తరువాత మంచి కథ కొసమే ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. ఇప్పడు సమాజం లో జరుగుతున్న ఒక మంచి పాయింట్ ని చాలా ఎంటర్‌టైనింగ్ గా తెరకెక్కించాము. ఏడు చేపల కథ చిత్రంతో చాలా ఫేమస్ అయిన నేచురల్ ఆర్టిస్ట్ అభిషేక్ రెడ్డి హీరోగా సాక్షి నిదియా జంటగా నటించారు. ఈ చిత్రం లో భార్య, భర్త మధ్య వుండే అన్ని రసాలు కలగలుపుగా వుంటాయి.. పూర్తి రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కిస్తున్నాము. ఇప్పటికే దాదాపు 70 పర్సంట్ కి పైగా షూటింగ్ ని పూర్తిచేసుకున్నాము.
ఈ రోజు విడుదల చేసిన టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బార్యాభర్తల మధ్య ప్రెజెంట్ ట్రెండ్ లో వున్న అసూయ ద్వేషాలు, ఎప్పటికో కనిపించే ప్రేమ దానిలో పొంగుకొచ్చే రొమాన్స్ ఇవన్ని మించితే వారి జీవితాలు ఎలా వుంటాయనేది చాలా చక్కగా మంచి కంటెంట్ తో తెరకెక్కించాము. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం.. అని అన్నారు నిర్మాత జి.చరితా రెడ్డి మాట్లాడుతూ.. డైరక్టర్ కళ్యాణ్ నాకు ఈ కథ చెప్పినప్పడు వెంటనే ఒకే చేశాను., ఎందుకంటే ఇలాంటి కథలు ఈ జెనరేషన్ లో రావాలి.. అందరూ తప్పకుండా చూడాలి.. వైవాహిక జీవితాలు నాశనం అయిపోతున్న రోజులు.. భార్యాభర్త మధ్య ప్రేమలు పోయి అసూయలు పెరుగుతున్న రోజులివి.
అసలు వీటి కారణం తెలుసుకోలేకపోతున్నారు ఈ కథలో ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. మనిషన్న ప్రతి ఓక్కరూ తప్పులు చేస్తారు.. ఆ తప్పు ఏంటో తెలుసుకున్న నాడు ఎలాంటి సమస్య కైనా పరిష్కారం వుంటుంది. చాలా చక్కగా కళ్యాణ్ తెరకెక్కించాడు. అభిషేక్ రెడ్డి, సాక్షి ఈ కథ కి చాలా చక్కగా సెట్ అయ్యారు. వైఫ్,ఐ మెదటి టీజర్ అందర్ని ఆకట్టకుంటుంది. మా యూనిట్ అంతా ధీమా గా వున్నారు. అని అన్నారు.