స్కెచ్‌లు వేయడంలో మొదటి నుండీ శ్రీముఖి తనదైన స్టైల్ చూపిస్తోంది బిగ్ హౌస్‌లో. చాలా తెలివిగా తన ఆట ఆడుతోంది. తనకు నచ్చిన వారితోనూ, నచ్చని వారితోనూ కూడా ఇంటర్నల్‌గా ఓ ఐడియాతో ఉంటోంది శ్రీముఖి. రాహుల్‌ని అయితే, డైరెక్ట్‌గానే టార్గెట్ చేసింది. బాబా భాస్కర్ వంటి వారితో ఇష్టంగా ఉంటూనే, తెలియకుండా దెబ్బ తీసేలా స్కెచ్ ప్రిపేర్ చేస్తోంది. ప్రస్తుతం తనకు అసిస్టెంట్‌గా మారింది హౌస్‌లో హిమజ.
శ్రీముఖి ఆలోచనల్ని, కన్నింగ్ పర్సనాలిటీని కొద్ది కొద్దిగా ఆకలింపు చేసుకుంటోంది హిమజ. ఆ కోణంలోనే కొత్తగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ శిల్పా చక్రవర్తిపై వీరిద్దరి వ్యూహ రచన స్టార్ట్ అయ్యింది. చాప కింద నీరులా ఆమెను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలనీ, కొంచెం కేరింగ్‌గానే ఉండాలనీ వీరిద్దరూ పర్సనల్‌గా మాట్లాడుకుంటున్నారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ వీక్‌లో నా తీరు ఎలా ఉందో, అచ్చం అలాగే శిల్పా తీరు ఉందనిపిస్తోందని హిమజ అభిప్రాయపడింది. బయటపడలేదు కానీ, శ్రీముఖి స్కెచ్ మరోలా ఉంది. ఇదిలా ఉంటే, హౌస్‌లోకి రావడంతోనే శిల్పా చక్రవర్తి శ్రీముఖిని టార్గెట్ చేసింది.
తన వంతుగా శ్రీముఖిని నామినేట్ చేసింది. ఆ మాటకొస్తే, ఆమె ఎంట్రీ ఇవ్వకుండానే శ్రీముఖిని ఓ ఆట ఆడేసుకుంది. నీ నోటి రమ్యకృష్ణగారు ప్లాస్టర్ వేశారు. అయినా నువ్వు నీ నోటికి తాళం వెయ్యవా.? అని సూటిగా ప్రశ్నించింది. బాబా భాస్కర్‌ని సైకో అన్నందుకు ముఖం మీదే అలా అనేస్తావా.? అని కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. 'రాక్షసి' అని సంబోధించింది. సో శిల్పా చక్రవర్తి ఎన్ని రోజులు హౌస్‌లో ఉంటుందో తెలీదు కానీ, ఎన్ని రోజులున్నా, శ్రీముఖికి ఏకు మేకు అయ్యేలానే ఉంది. చూడాలి మరి.