15 మంది కంటెస్టెంట్స్ ప్లస్, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ (తమన్నా సింహాద్రి)తో స్టార్ట్ అయిన బిగ్‌బాస్ సీజన్ 3, 40 రోజుల షోలో ఇంతవరకూ ఒక్కసారి కూడా నామినేషన్‌లో నిలవక పోవడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ ఆశ్చర్యకరమైన వ్యక్తి అలీ రైజా. నిజానికి హౌస్‌లో అలీ కారణంగా బిగ్ ఇష్యూసే ఫామ్ అయ్యాయి హౌస్‌లో. అయినా ఇంతవరకూ ఆయన నామినేట్ కాలేదు. కానీ, ఈ సారి హౌస్ మేట్స్ అంతా కలిసి అలీ రైజాకి నామినేషన్ టేస్ట్ చూపించాలని డిసైడ్ అయ్యారు.
ఆ క్రమంలో వరుణ్ సందేశ్, మహేష్, బాబా భాస్కర్, వితిక తదితరులు అలీ రైజాని నామినేట్ చేశారు. చివరిగా, హౌస్‌లోకి ఫ్రెష్ ఎంట్రీ ఇచ్చిన సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ శిల్పా చక్రవర్తి కూడా అలీ పైనే దృష్టి పెట్టింది. ఆయన్ని నామినేట్ చేసేందుకు కారణాలు పెద్దగా లేవు కానీ, ఇంతవరకూ నామినేట్ కాలేదన్న బిగ్ రీజన్‌తోనే శిల్పా చక్రవర్తి అలీని నామినేట్ చేసింది. నామినేషన్‌లో ఉండడం వల్ల కలిగే ప్రెజర్‌ని అందరూ ఫీలయ్యాం కానీ, అలీ ఒక్కడే ఆ ప్రెజర్ తీసుకోలేదు.
ఆ ప్రెజర్‌ని అలీ ఎలా తీసుకుంటాడనేది చూడాలని ఉందన్న తన కోరికను వరుణ్ సందేశ్ బయట పెట్టాడు. అలా అలీరైజా తొలిసారిగా ఈ వారం ఎలిమినేషన్‌లోకి అడుగుపెట్టాడు. ఇక ఎప్పటిలాగే రాహుల్ ఎలిమినేషన్‌లో ఉన్నాడు. అలీ, రాహుల్‌తో పాటు, మహేష్, రవికృష్ణ, శ్రీముఖి ఈ సారి హౌస్ నుండి బయటికి వెళ్లేందుకు నామినేట్ అయిన వారి లిస్టులో ఉన్నారు.