శ్రీముఖిని కడిగి పారేసిన జ్యోతక్క!

మరిన్ని వార్తలు

ఇంతవరకూ శ్రీముఖికి తగ్గ వాళ్లు పడలేదు హౌస్‌లో. హౌస్‌లో ఆమె డామినేషన్‌ చాలా ఎక్కువనీ, బిగ్‌బాస్‌కే బాస్‌నని తెగ ఫీలయిపోతుందనే అభిప్రాయాలున్నాయి శ్రీముఖిపై. అయితే, ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా, ఇద్దరిద్దరిని జంటగా ఎంచుకుని హాట్‌ సీట్స్‌పై కూర్చొని వారిద్దరిలో ఎవరు హౌస్‌లో ఉండడానికి అర్హులు.? ఎందుకు.? అని కారణాలు చెప్పి నామినేట్‌ చేసుకోవాలని బిగ్‌బాస్‌ సూచించారు. అలా శ్రీముఖి, శివజ్యోతి జంటను సెలెక్ట్‌ చేసి హాట్‌ సీట్‌ ఎక్కించాడు బిగ్‌బాస్‌.

 

హాట్‌ సీట్‌లో కూర్చున్నారని కాదు కానీ, ఈ ఇద్దరి నుండీ చాలా చాలా హాట్‌ ఇష్యూస్‌ బయటికొచ్చేశాయి ఈ సందర్భంగా. శివజ్యోతి చాలా ఎమోషనల్‌ అనీ, ప్రతీ చిన్న దానికీ ఏడుస్తుందని, సో ఆ కారణంగా తనను నామినేట్‌ చేస్తున్నానని శ్రీముఖి అభిప్రాయం చెప్పింది. కానీ, తాను మనుషులతో ఎమోషనల్‌ కానీ, గేమ్‌ కోసం ఆ ఎమోషన్‌ని తాను కంట్రోల్‌ చేసుకోగలనీ స్ట్రాంగ్‌గా సమాధానమిచ్చింది శివజ్యోతి. అంతేకాదు, ఇక్కడి మాటలు అక్కడ చెప్పి, ముఖాల మీదే అనకూడని మాటలు అంటూ అవతలి వాళ్లని హర్ట్‌ చేసేలా తాను బిహేవ్‌ చేయలేదని శ్రీముఖికి చురకలు అంటించింది. అంతటితో ఆగలేదు.

 

అన్నింటికీ సిద్ధపడి గేమ్‌ ఆడడానికి వచ్చినప్పుడు టాస్క్‌ల్లో నన్ను అక్కడ తాకొద్దు, ఇక్కడ తాకొద్దు.. అని చెప్పడం సబబు కాదనీ, బిగ్‌బాస్‌ ప్రాపర్టీస్‌ని శ్రీముఖిలా తాను ధ్వంసం చేయలేదనీ కడిగి పారేసింది. ఈ ఇష్యూస్‌తో హౌస్‌లో ఉండేందుకు శ్రీముఖి అనర్హురాలు, తాను అర్హురాలిననీ చెప్పి, మిగిలిన హౌస్‌మేట్స్‌ మద్దతు కోసం ఎదురు చూసింది శివజ్యోతి. ఆయా కారణాలతో శివజ్యోతికే హౌస్‌లో మద్దతు లభించింది. అలా శివజ్యోతి సేవ్‌ అయ్యి, శ్రీముఖి నామినేట్‌ అయ్యింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS