హౌస్‌లో మిస్టర్ పర్‌ఫెక్ట్ రాహుల్‌ని శ్రీముఖి ఏదో విషయమై వెంటాడి, వేటాడుతూనే ఉంది. ఈ వారం హౌస్ నుండి బయటికి పంపేందుకు ఎప్పటిలానే సేమ్ రీజన్‌తో నామినేట్ చేసింది. టాస్క్‌ల్లో ఎక్కడ ఛాన్స్ దొరికినా రాహుల్‌ని ఇరికించేయాలనే చూస్తోంది. అందుకే శ్రీముఖి అంటే పాపం రాహుల్ భయపడిపోతున్నాడు. ఎందుకొచ్చిన లొల్లిలే అని చాలా సార్లు పక్కకు తప్పుకుంటున్నాడు. లేటెస్ట్‌గా, 'దొంగల రాజ్యంలో నగరవాసులు' టాస్క్‌కి సంబంధించి ఒకానొక సందర్భంలో ఎప్పటిలాగే రాహుల్‌ని ఇరికించేందుకు ట్రై చేసిన శ్రీముఖికి చుక్కెదురైంది.
రాహుల్ తరపున పునర్నవి స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుంది. ప్రతీసారి రాహుల్‌ని టార్గెట్ చేసి, శ్రీముఖి తనదే పై చేయి అన్నట్లుగా విజయ గర్వం చూపించేది. కానీ, ఈ సారి ఎందుకో పునర్నవి ఊరుకోలేదు. 'అక్కడున్నది రాహుల్ కాబట్టి, నువ్వు అలాగే మాట్లాడుతావ్..' అంటూ ఆ సందర్భంలో శ్రీముఖికి గట్టిగా చురకలంటించింది. దాంతో తన వ్యూహం ఫలించలేదని శ్రీముఖి వెనక్కి తగ్గింది. అలాగే మరోసారి, రాహుల్, అలీకి మధ్య చిన్న యాక్షన్ చోటు చేసుకుంది. దొంగల టీమ్ అయిన రాహుల్‌ని నగర వాసి అయిన అలీ స్విమ్మింగ్ పూల్‌లోని నిధిని కాపాడే క్రమంలో సీరియస్‌గా నెట్టే ప్రయత్నం చేశాడు. అక్కడ కాసేపు చిన్న మాటల యుద్ధం చోటు చేసుకుంది. వరుణ్, వితికల మధ్య కూడా గన్ విషయమై చిన్న గొడవ జరిగింది.
ఇలా ఈ 'దొంగల రాజ్యంలో నగర వాసులు' టాస్క్‌కి సంబంధించి చిన్న చిన్న డిస్ట్రబెన్సెస్ చాలానే చోటు చేసుకున్నాయి. హింసకు తావు లేదంటూ, బిగ్‌బాస్ టాస్క్ మధ్యలోనే హౌస్‌మేట్స్‌ని వార్న్ చేశారు. కానీ, ఇలాంటి ఫిజికల్ టాస్క్‌లు ఇచ్చినప్పుడు గాయాలు కాకుండా ఎలా ఉంటాయ్.? అనేది నెటిజన్స్ నుండి రైజ్ అవుతున్న ప్రశ్న. మరి దీనికి బిగ్‌బాస్ నుండి వచ్చే సమాధానం ఎలా ఉంటుందనుకోవాలి.? మొత్తానికి ఈ టాస్క్‌లో ఎవరి టీమ్ గెలుస్తుందో, ఎవరి టీమ్ ఓడిపోతుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.