మెగాస్టార్ 153వ సినిమాకి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన 'లూసిఫర్' సినిమాని అందుకు సిద్ధంగా ఉంచారు కూడా. అయితే ఈ సినిమాకి దర్శకత్వం వహించేదెవరు.? అనే ప్రశ్నపై ఆసక్తికరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. అయితే, ఈ లైన్‌లో హరీష్ శంకర్ కూడా ఉన్నారు. రీమేక్ సినిమాల్ని హరీష్ శంకర్ బాగా డీల్ చేయగలడని 'గబ్బర్ సింగ్', 'గద్దలకొండ గణేష్' సినిమాలతో ప్రూవ్ అయ్యింది.
సో సుకుమార్ పేరు వినిపిస్తున్నా, హరీష్ శంకర్‌కీ ఛాన్స్ లేకపోలేదంటున్నారు. చిరంజీవితో సినిమా తెరకెక్కించడానికి హరీష్ శంకర్ కూడా ఉవ్విళ్లూరుతున్నాడు. మరి ఈ మెగా ఛాన్స్ ఇటు సుకుమార్‌కి దక్కుతుందా.? అటు హరీష్ శంకర్‌ని వరిస్తుందా.? వేచి చూడాలిక. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం 'సైరా' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.
కొరటాల శివ సినిమా కోసం సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే సుకుమార్ బన్నీతో సినిమా కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. 'అల వైకుంఠపురములో' కంప్లీట్ కాగానే, సుకుమార్ - బన్నీ సినిమా పట్టాలెక్కనుంది. కొరటాల శివతో చిరు సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఆయన తదుపరి సినిమా దర్శకులు ఎవరనే అంశంపై పక్కాగా క్లారిటీ రానుంది.