భారత క్రికెట్ టీమ్‌లో కీలకపాత్ర పోషించిన క్రికెటర్ శ్రీశాంత్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేసి చాలా కాలమే అయ్యింది. మనోడు హీరోగా మారి వెండితెరపై వెలుగు వెలగాలనుకుంటున్నాడు. ఆల్రెడీ శ్రీశాంత్ ఈ ప్రయత్నం మొదలెట్టేసి కూడా చాలా కాలమే అయ్యింది. శ్రీశాంత్ హీరోగా 'టీమ్ 5' అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో బైక్ రేసర్‌గా కన్పించబోతున్నాడు శ్రీశాంత్. సౌత్‌లో ఓ బైక్ రేసర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదేనట. ఇందులో మెయిన్ హైలైట్ మరొకటుందని అంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. అదే శ్రీశాంత్ డాన్స్. శ్రీశాంత్ మంచి డాన్సర్ అని తెలుసుగానీ, వెండితెరపై డాన్సింగ్ టాలెంట్ చూపించగలడా? అన్న అనుమానాలున్నాయి. ఆ అనుమానాల్ని పటాపంచలు చేసి బెస్ట్ డాన్సర్ అనిపించుకుంటాడట శ్రీశాంత్. ఆల్రెడీ తనకున్న డాన్సింగ్ టాలెంట్‌కి మరింత శిక్షణ ఇచ్చి, ఇప్పటికే మంచి డాన్సర్‌గా తయారయ్యానంటున్నాడు శ్రీశాంత్. ముద్దుగుమ్మ నిక్కీ గల్రాని ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. కేవలం డాన్సే కాదు, యాక్షన్ ఎపిసోడ్స్, సినిమాటోగ్రఫీ సినిమాకి ఉన్న కొన్ని హైలైట్స్ అని చిత్ర దర్శక నిర్మాతలు చెప్పారు. సురేష్ గోవింద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జులై 14న సినిమా విడుదల కానుంది. క్రికెట్‌లో తన సత్తా చాటిన శ్రీశాంత్ సినీ రంగంలో ఏ స్థాయిలో రాణిస్తాడో చూడాలిక.