అల్లు వారబ్బాయితో శ్రీరెడ్డికి లింకేంటీ.?

మరిన్ని వార్తలు

దగ్గుబాటి రానా సోదరుడిపై ఆరోపణలు చేస్తూ కొన్ని ఫోటోలు లీక్‌ చేసింది శ్రీరెడ్డి. తాజాగా మెగా కాంపౌండ్‌ని కెలికింది. అల్లు అర్జున్‌ సోదరుడు అల్లు బాబీపై సంచలన ఆరోపణలు చేసింది. ఓ స్టార్‌ హోటల్‌లో మేమిద్దరం ఎంజాయ్‌ చేశామనీ, అతనికి పార్టీలంటే చాలా ఇష్టమనీ బాంబ్‌ పేల్చింది. 

ఎందుకీ ఆరోపణలు చేస్తుందో ఆమెకే అర్ధం కావడం లేదు అని కొంతమంది అంటున్నారు. అయితే శ్రీరెడ్డి మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. తమిళ దర్శకుడు మురుగదాస్‌, ఆ తర్వాత శ్రీకాంత్‌ (శ్రీరామ్‌), కొరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడు లారెన్స్‌.. ఇలా పలువురు ప్రముఖులను లాగిన శ్రీరెడ్డి తెలుగులో శేఖర్‌ కమ్ముల, నాని వంటి వారిని లాగింది. శ్రీరెడ్డి ఆరోపణలపై శేఖర్‌ కమ్ముల, కోనవెంకట్‌ లాంటి వాళ్లు స్పందించారు. నాని లీగల్‌ నోటీసులు పంపించాడు. ఇప్పుడు శ్రీరెడ్డి ఆరోపణల్లో అల్లు వారబ్బాయి పేరొచ్చింది. 

అల్లు అరవింద్‌ స్పందిస్తాడా? పవన్‌ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడే అల్లు అరవింద్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తన కుమారుడిపైనే శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తోంది. అల్లు అరవింద్‌ ఊరుకుంటారనుకోవడానికి లేదు. అయితే ఎవర్నీ వదిలిపెట్టేది లేదనీ, సినీ పరిశ్రమ నుండి కాస్టింగ్‌ కౌచ్‌ని తరిమి కొట్టే వరకూ నిష్క్రమించేది లేదనీ శ్రీరెడ్డి అంటోంది. తన ఆరోపణలకు సంబంధించి అతి త్వరలో కొన్ని వీడియోలను కూడా విడుదల చేయనుందట శ్రీరెడ్డి.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS