జనసేన పార్టీ మీద, ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ మీద సెటైర్లు వేయడం శ్రీరెడ్డికి కొత్త కాదు. పవన్ కళ్యాణ్ తల్లిని బూతులు తిట్టిన ఘనత శ్రీరెడ్డిది. ఆ దెబ్బతోనే శ్రీరెడ్డి చెన్నయ్‌కి చెక్కేయాల్సి వచ్చింది. శ్రీరెడ్డి లేటెస్ట్ పంచ్, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు మీద కావడం గమనార్హం. ఇటీవల జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ 'గ్లాస్ టంబ్లర్'ను ఎన్నికల గుర్తుగా కేటాయించిన సంగతి తెల్సిందే. అయితే అది బీరు గ్లాసు కాదు కదా.. అని సెటైర్లు వేసింది శ్రీరెడ్డి.
రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తు అత్యంత పవిత్రమైనది. ఆ ఎన్నికల గుర్తు మీదనే ఆయా పార్టీలు పోటీ చేయాల్సి వుంటుంది. అలాంటి గ్లాసు మీద శ్రీరెడ్డి లాంటోళ్ళు సెటైర్లు వేయడం హాస్యాస్పదమే. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు శ్రీరెడ్డి సెటైర్ల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని ఏదో ఒక రకంగా విమర్శించి, తద్వారా తన ఇమేజ్ పెంచుకోవాలని శ్రీరెడ్డి ప్రయత్నం చేస్తున్నా, ఆ ప్రయత్నం ఆమెకు సత్ఫలితాలనైతే ఇవ్వడంలేదు. కానీ, ఆమె పొందాలనుకుంటోన్న పైశాచికానందం మాత్రం పొందుతోంది.
కొంత కాలంగా గొంతు సమస్యతో నాగబాబు ఇబ్బంది పడిన సంగతి తెల్సిందే. ఆ విషయాన్ని ఎలివేట్ చేస్తూ, కొత్త గొంతు వచ్చాక, ఏం మాట్లాడుతున్నాడో తెలియడంలేదనీ, నాగబాబుకీ ఓ గ్లాస్ (పెగ్గు) అందించాలని శ్రీరెడ్డి సెటైర్లు వేసింది. నవ్విపోదురుగాక మానకేటి? అన్నట్టుంది శ్రీరెడ్డి వ్యవహారం. సాటి మహిళను బూతులు తిట్టిన శ్రీరెడ్డి నుంచి అధమస్థాయి మాటలు కాక ఇంకేం వస్తాయ్!