నానిని మళ్లీ కెలికిన శ్రీరెడ్డి

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో అనుచిత ఆరోపణలు చేసి, ఇండస్ట్రీ పరువు ప్రఖ్యాతల్ని బజారుకీడ్చిన నటి శ్రీరెడ్డి కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి, ఈ మధ్యనే మళ్లీ చిన్న చిన్న కామెంట్స్‌తో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. గతంలో ఈమె చేసిన రాద్ధాంతానికి మీడియా చూపిన అత్యుత్సాహంతో, గడ్డి కరిచిన మీడియా ఇప్పుడు అస్సలు ఈమెని పట్టించుకోవడం లేదు. దాంతో తన ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారానే తన నోటి దురద తీర్చుకుంటోంది ఆగలేక శ్రీరెడ్డి. 

గతంలో ఓ సారి నేచురల్‌ స్టార్‌ నాని కామాంధుడు అంటూ అభివర్ణించిన శ్రీరెడ్డి లేటెస్టుగా మరోసారి నానిని టార్గెట్‌ చేసింది. 'ఇంతవరకూ ఒకే జోనర్‌ లవ్‌స్టోరీస్‌ని ఎంచుకుని హిట్స్‌ కొట్టావ్‌. వాటిలోనూ కొన్ని ఫ్లాప్స్‌ ఉన్నాయి. ఆ లవ్‌స్టోరీస్‌ జోనర్‌ దాటి కొత్త కథలను ఎంచుకుని మెప్పించలేని నువ్వు నేచురల్‌ స్టార్‌ ఎలా అవుతావు? అంటూ నానిని కామెంట్‌ చేసింది. సినిమాల్లో ఛాన్సుల్లేవు. ఏదో అనుకుని పబ్లిసిటీ స్టంట్‌ చేస్తే, అదింకేదో అయ్యి, ఆమె మెడకు చుట్టుకుంది. ఎలాగోలా వార్తల్లో నిలవాలనే తపనతో నోరుంది కదా అని నోటికొచ్చినట్లు నోరు పారేసుకోవడం తప్ప శ్రీరెడ్డికి మరో పని ఉన్నట్లు తోచడం లేదు. 

ఎంత ట్రై చేసినా, ఎగిరెగిరి కింద పడ్డమే శ్రీరెడ్డి వంతవుతోంది తప్ప, సాధించింది ఏమీ కనిపించడం లేదు. నోరు జాగ్రత్తగా ఉంచుకుంటే, ఎట్‌ లీస్ట్‌ ఏదో ఒక రకంగానైనా సినిమాలో వేషాలు వచ్చేవి కదా. ఆ విషయాన్ని శ్రీరెడ్డి ఎప్పుడు గ్రహిస్తుందో ఆమెకే తెలియాలి మరి. 

ఏది ఏమైనా శ్రీరెడ్డి టాపిక్‌ ఇంకా అలా అలా సోషల్‌ మీడియాలో స్క్రోలింగ్‌ అవుతోంది కానీ, ఎందుకొచ్చిన తలనొప్పిలే అని మీడియా మాత్రం అస్సలు జోక్యం చేసుకోవడం లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS