రాంకీ అనే ఓ నటుడు, నిర్మాతపై శ్రీరెడ్డి తాజాగా సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలు చేసింది. కాస్టింగ్ కౌచ్ వివాదంపై మీడియాలో జరిగిన అనేక డిస్కషన్లలో రాంకీ పాల్గొన్నాడు. అయితే ఆయన ఎవర్నీ సమర్థించలేదు, ఎవర్నీ వ్యతిరేకించలేదు. చాలా బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడిన రాంకీపై వున్నపళంగా శ్రీరెడ్డి ఆరోపణలు గుప్పించింది. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాధారాలంటూ స్క్రీన్ షాట్స్ కొన్నిటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇలాంటివి నిర్మాత సురేష్‌బాబు తనయుడిపై ఆరోపణలు చేసినప్పుడూ, రచయిత కోన వెంకట్‌పై ఆరోపణలు చేసినప్పుడూ, మరికొందరిపై ఆరోపణలు చేసినప్పుడూ కొన్నింటిని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అయితే పక్కా ఆధారాల్ని మాత్రం ఇంతవరకు శ్రీరెడ్డి పోలీసుల ముందుంచలేదు. ఆరోపణలతో శ్రీరెడ్డి ఇంకెన్నాళ్ళు పబ్బం గడుపుతుందని కొందరు ప్రశ్నిస్తోంటే, చాలామంది శ్రీరెడ్డిని పూర్తిగా లైట్ తీసుకున్నారు.
ప్రస్తుతం శ్రీరెడ్డి తమిళ సినీ పరిశ్రమ కేంద్రంగా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడామెకు ఓ సినిమాలో అవకాశం వచ్చింది కూడా. అక్కడా పలువురు సినీ ప్రముఖులపై శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే. అర్థం పర్థం లేని ఈ ఆరోపణల దాడిని శ్రీరెడ్డి ఇంకెన్నాళ్ళు కొనసాగిస్తుందో?