లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలు చూపించాలని తమిళ ప్రముఖ నటుడు విశాల్ పేర్కొన్నాడు. ఆ విషయమై కాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు సృస్టించిన నటి శ్రీరెడ్డి రెస్పాండ్ అయ్యింది. డైరెక్ట్‌గా విశాల్ పేరు చెప్పకపోయినా, పరోక్షంగా విశాల్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. నా జోలికి రావద్దు. వచ్చావంటే నీకు ట్రబుల్స్ తప్పవు అని శ్రీరెడ్డి చెప్పింది.
ప్రస్తుతం శీరెడ్డిని అందరూ మర్చిపోయారు. ఏం చేసినా, ఎంత చేసినా లెక్క చేయడం లేదు. అందుకే ఇలా ఏదో రకంగా వార్తల్లోకెక్కాలని చూస్తోంది. తమిళ మీడియాని భలే మేనేజ్ చేస్తున్నావ్. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్, నడగర్ సంఘం మెంబర్‌గా అక్కడి మీడియా నోరు నొక్కేస్తున్నావ్ అని శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా మాటల తూటాలు పేల్చింది.
'ఇఫ్ యు ట్రబుల్డ్ ది ట్రబుల్ యు విల్ గెట్ ట్రబుల్స్.. లెట్ మీ డూ మై వర్క్..' అని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌తో తమిళ పరిశ్రమలో ఇప్పుడు మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి దాకా తెలుగు సినీ ప్రముఖులే టార్గెట్‌గా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన శ్రీరెడ్డి టార్గెట్‌ని ఇప్పుడు తమిళ సినీ ప్రముఖుడైన విశాల్‌పై పెట్టడం వెనక అసలు ఉద్దేశ్యాలేంటో తెలీడం లేదు కానీ, ఈ రకంగా మరోసారి శ్రీరెడ్డి వార్తల్లో నిలవడం ఒకింత హాస్యాస్పదంగానూ, మరోవైపు ఆశ్చర్యకరంగానూ ఉంది.
హీరోగానే కాకుండా తమిళ సినీ నిర్మాతల కౌన్సిల్‌లో కీలక బాథ్యతలు నిర్వర్తిస్తున్నాడు విశాల్. అలాంటిది విశాల్‌ని శ్రీరెడ్డి ఎందుకిలా బజారుకీడ్చేస్తోందో ఆమెకే తెలియాలి.