శ్రీరెడ్డికి లారెన్స్‌ ఛాన్సిచ్చాడట.. నిజమేనా!

By iQlikMovies - October 16, 2018 - 13:49 PM IST

మరిన్ని వార్తలు

ఓ తమిళ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన శ్రీరెడ్డికి తాజాగా ఇంకో బంపర్‌ ఆఫర్‌ తగిలిందట. అది కూడా దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌ సినిమాలోనట. లారెన్స్‌ రూపొందించనున్న కొత్త సినిమాలో తనకు ఆఫర్‌ వచ్చిందంటూ సోషల్‌ మీడియాలో శ్రీరెడ్డి ప్రకటించేసింది. 

టాలీవుడ్‌లో 'కాస్టింగ్‌ కౌచ్‌' ప్రకంపనలు రేపి, వార్తల్లో వ్యక్తిగా మారిన శ్రీరెడ్డి, పవన్‌కళ్యాణ్‌ తల్లి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌కి చెక్కేయాల్సి వచ్చింది. తెలుగునాట ఆమె జుగుప్సాకరమైన తీరుకి సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమయిన సంగతి తెల్సిందే. తమిళ సినీ పరిశ్రమకి వెళ్ళి, అక్కడా పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసింది. ఆ లిస్ట్‌లో లారెన్స్‌ పేరు కూడా వుంది. లారెన్స్‌ కూడా తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది శ్రీరెడ్డి. అయితే, తాను అవకాశాల పేరుతో ఏ మహిళ పట్లా అసభ్యకరంగా ప్రవర్తించలేదనీ, ప్రవర్తించబోననీ టాలెంట్‌ వుంటే ఎవరికైనా అవకాశమిస్తాననీ, శ్రీరెడ్డి తన టాలెంట్‌ని నిరూపించుకుంటే ఆమెకైనా అవకాశం ఇవ్వడానికి వెనుకాడనంటూ 'ఆడిషన్‌'కి పిలిచాడు. 

అయితే, ఆ ఆడిషన్‌ పేరుతో ఏం చేయబోతున్నారోనని అనుమానం వ్యక్తం చేసింది శ్రీరెడ్డి. ఆడిషన్‌ ఓపెన్‌గా జరుగుతుందనీ, శ్రీరెడ్డి తనతోపాటు ఎవర్నయినా రక్షణగా తీసుకురావొచ్చన్నాడు లారెన్స్‌. కొన్నాళ్ళ తర్వాత శ్రీరెడ్డి, మనసు మార్చుకుని ఆడిషన్స్‌కి వెళ్ళింది. లారెన్స్‌ ఇంట్లో చాలామంది పిల్లలు వున్నారట. వారంతా చాలా ఆప్యాయంగా పలకరించారట. లారెన్స్‌ కూడా ఎంతో బాగా చూసుకున్నాడట. ఆడిషన్‌ అయ్యాక, లారెన్స్‌ - శ్రీరెడ్డికి ఛాన్స్‌ కన్‌ఫామ్‌ చేశాడట. 

అయితే, ఇదంతా నిజమేనా? అనేది తేలాల్సి వుంది. ఎందుకంటే తమిళంలో శ్రీరెడ్డి బయోపిక్‌ అనే ప్రచారం జరిగింది. అదంతా హంబక్‌ అని తేలిపోయింది. శ్రీరెడ్డి చేస్తున్న తమిళ సినిమా కూడా ఎంతవరకు వాస్తవమో తెలియదు మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS