నిర్మాత పుప్పాల రమేష్ తనపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణల్ని ఖండించారు.
శ్రీరెడ్డి తనకు రెగ్యులర్‌గా ఫోన్‌లో మెసేజ్‌లు పెట్టేది. గుడ్‌మార్నింగ్ అని మెసేజ్ పెట్టి, తర్వాత ఫోటోలు పంపించి, ఫోటో ఎలా ఉంది అని అడిగేది. ఆ ఫోటోల వెనక ఇంత కుట్ర ఉంటుందని అనుకోలేదు. తనపై ఎప్పుడూ మిస్ బిహేవ్ చేయలేదు. నాకు ఒక చెయ్యి లేదు. నా అవిటితనాన్ని ఆమె గేలి చేసింది. ఆమెపై పరువు నష్టం దావా వేస్తాను. అలాగే వికలాంగున్నైన నా పైన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినందుకు మరో కేసు కూడా వేస్తానని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమలో ఎంతో హుందాగా, గౌరవంగా మసలుతున్నాను నేను అని ఆయన చెప్పారు.
శ్రీరెడ్డి అసభ్యరకమైన ఆరోపణలు మెగా ఫ్యామిలీని తాకాయి. దాంతో మెగా బ్రదర్ నాగబాబు మీడియా ముందుకొచ్చారు. అన్యాయం జరిగితే, పోలీసులు, కోర్టులున్నాయి. అక్కడికి వెళ్లి న్యాయ పోరాటం చేయాలి. అంతేకానీ, పర్సనల్ ఇష్యూస్‌ని టచ్ చేస్తే ఊరికే ఉండబోమని హెచ్చరించారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన సమస్య కాదు. వర్క్ ప్లేస్‌లో ప్రతీ రంగంలోనూ ఉంది అని నాగబాబు అన్నారు.
మరో వైపు జీవితా రాజశేఖర్‌పై సోషల్ యాక్టివిస్ట్ సంధ్యతో కలిసి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు కూడా వైరల్ అయ్యాయి. ఆ ఆరోపణలపై జీవితా రాజశేఖర్ కూడా కేసు నమోదు చేశారు. అయినా కానీ శ్రీరెడ్డి ఎవరి బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్స్‌కీ లొంగననీ, తన లీక్స్ ఇంకా కొనసాగుతూనే ఉంటాయనీ ట్వీట్ చేసింది. తన తదుపరి లీక్స్ జీవితా రాజశేఖర్‌కే, సిద్ధంగా ఉండమని హెచ్చరించింది. ఇలా రకరకాల మలుపులు తిరుగుతున్న శ్రీరెడ్డి లీక్స్ ఇంకెంత దూరం వెళతాయో చూడాలిక.