అనవసరంగా టీవీ ఛానెల్స్ డిబేట్స్‌కి వెళ్లి, ఆయా ఛానెల్స్ టీఆర్‌పీ రేటింగ్స్ పెంచడం తనకిష్టం లేదనీ, మీడియా మిత్రులను ఇంటికి పిలిపించి, నిన్న జీవితా రాజశేఖర్ ఓ ప్రెస్ మీట్‌ని అరేంజ్ చేశారు. అదే శ్రీరెడ్డి లీక్స్‌కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాకి ఓ వీడియో చూపించారు.
ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నదే ఆ వీడియో. అందులో చాలా అసభ్యకరంగా ఫేస్‌బుక్ లైవ్‌లో అబ్బాయిల్ని రెచ్చగొడుతూ మాట్లాడింది శ్రీరెడ్డి. అత్యంత దిగజారుడుతనం ప్రదర్శించింది. మామూలు మహిళ ఎవరూ ఆ స్థాయికి దిగజారి అలా మాట్లాడరు. ఇప్పుడేమో ఉద్యమించేస్తున్నాను అని శ్రీరెడ్డి హడావిడి చేస్తోంది. ఎప్పుడయితే జీవిత కారణంగా ఆ వీడియో ఇంకా హైలైట్ అయ్యిందో శ్రీరెడ్డి డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగింది.
అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు నేను కాస్టింగ్ కౌచ్‌కి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. దయచేసి పాత విషయాలు ప్రస్తావించొద్దు అని విజ్ఞప్తి చేస్తోంది శ్రీరెడ్డి. సినీ పరిశ్రమలో తనను ఎవరో వేధించారనీ, లైంగిక దాడి చేశారనీ, గత విషయాలను ప్రస్తావిస్తున్న శ్రీరెడ్డి తన గతంలోని అసభ్యకర ప్రవర్తన మాత్రం ఎవరూ ఎత్తి చూపొద్దని విజ్ఞప్తి చేయాల్సి వస్తోంది.
ఇక్కడే ఆమె డొల్లతనం బయటపడిపోయింది. ఆమె గతం ఎవ్వరూ తవ్వకూడదట. ఇతరుల గతం మాత్రం ఆమె తవ్వి తీసేస్తానంటోంది. ఇదెక్కడి న్యాయం. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, ఇలాగే పరిస్థితులు రివర్స్ అవుతాయి.