చాముండేశ్వర్ స్వామి, సచిన్ టెండూల్కరన్ పేర్లను ప్రస్థావిస్తూ శ్రీరెడ్డి ఛార్మింగ్ బాంబు పేల్చింది. ఛార్మింగ్ బ్యూటీతో సచిన్ టెండూల్కరన్ రొమాన్స్ చేశాడనీ, ఈ తతంగానికి చాముండేశ్వర్ స్వామి మధ్యవర్తిగా వ్యవహరించాడనీ, శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేసింది. ఛార్మింగ్ బ్యూటీ అంటే తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఎవరో అందరికీ తెలుసు.
సచిన్ టెండూల్కరన్ ఎవరో తెలుసుకోలేనంత వెర్రివెంగళప్పలు ఎవరూ లేరిక్కడ. చాముండేశ్వర్ స్వామి అని తోకలు తగిలించినా, ఆ వ్యక్తి సుపరిచితుడే. డైరెక్టుగా పేర్లు చెప్పే దమ్ము లేనప్పుడే తోకలు తగిలిస్తుంటారు. గత కొన్నాళ్లుగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలపై ఆరోపణలతో విరుచుకుపడుతున్న శ్రీరెడ్డి ఇప్పుడు తన పరిధిని పెంచుకోవడానికి నానా పాట్లు పడుతోందనుకోవాలి. ఇప్పటికీ వ్యవహారం ఇక్కడి దాకా వచ్చింది.
రానున్న రోజుల్లో బరాక్ ఒబామా, బిలిగేట్స్ వంటి వారి పేర్లకు తోకలు జోడించి పలానా బ్యూటీతో పక్కలు పంచుకున్నారనే ఆరోపణల్ని వినాల్సి వస్తుందేమో శ్రీరెడ్డి నోట. నాని మీద ఆరోపణలు చేసింది. ఆధారాల్లేవ్. శేఖర్ కమ్ముల మీద ఆరోపణలు చేసింది. ఆధారాల్లేవ్. లారెన్స్ మీద ఆరోపణలు చేసింది. వాటికీ ఆధారాల్లేవ్.
బట్ట కాల్చి ముఖాన పడేయడం, మసి తుచుకోమనడం శ్రీరెడ్డికి అలవాటైపోయింది.