శ్రీరెడ్డికి టార్గెట్‌ అయిన ముద్దుగుమ్మ.!

మరిన్ని వార్తలు

ఆమెతో పెట్టుకోవడం అంటే, కొరివితో తల గోక్కోవడం, బురదలో రాయి విసరడం.. వంటిదే. అందుకే ఎందుకొచ్చిన గోలరా బాబూ.. అంటూ ఆమెని ఎవ్వరూ పట్టించుకోరు. ఇంతకీ ఆమె ఎవరో అర్ధమైపోయే ఉంటుందనుకుంటా.! అవునండీ ఆమెనే శ్రీరెడ్డి. 'కాస్టింగ్‌ కౌచ్‌' అంటూ ఫిలిం ఛాంబర్‌ ఎదుట రియల్‌ డర్టీ పిక్చర్‌ చూపించేసిన శ్రీరెడ్డి, ఆ తర్వాత ఆ డర్టీ పిక్చర్‌ని సోషల్‌ మీడియా వేదికగా కొనసాగిస్తూనే ఉంది. జుగుప్సాకరమైన మాటలతో పలువురు సినీ ప్రముఖుల గౌరవ, మర్యాదలతో ఆటలాడుకుంది.

 

అయితే, గర్భ కక్కుర్తి, నోటి దూలలాంటివేవో తీర్చుకుంది కానీ, ఏం పీకలేకపోయిందనుకోండి. చాలా కాలమే అయ్యింది. ఆమెను జనం మర్చిపోయారనుకుంది కాబోలు, ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలనుకుంది. ఈ సారి ముద్దుగుమ్మ పూనమ్‌ కౌర్‌ని కెలికింది. ఇటీవల పూనమ్‌ రాజకీయాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ వేసింది. 'అబద్ధాలు చెప్పేవాడు రాజకీయ నాయకుడు అవుతాడేమో. కానీ, నాయకుడు, లీడర్‌ ఎప్పటికీ కాలేడు..' అంటూ ఆమె ట్వీటారు. ఈ ట్వీట్‌ ఒకింత సెన్సేషనల్‌ అయ్యిందనుకోండి.

 

ఈ ట్వీట్‌పై ఒక్కొక్కరు ఒక్కో రంగా స్పందించారు. అయితే, పచ్చిగా ఉంటేనే కదా, అది మన శ్రీరెడ్డి స్పందన అవుతుంది. అందుకే ఆమె తనదైన శైలిలో పూనమ్‌పై విరుచుకుపడింది. దమ్ముంటే పేరు చెప్పి ట్వీట్‌ వెయ్యి.. అంటూ తనకు తోచిన మ్యాజిక్‌లేవో చేసిందనుకోండి. అయితే, శ్రీరెడ్డికి పూనమ్‌ కౌర్‌ కౌంటర్‌ ఇస్తుందా? లేక పైన చెప్పుకున్నాం కదా.. ఆమెతో పెట్టుకుంటే, ఎందుకొచ్చిన తంటాలే అనుకుని లైట్‌ తీసుకుంటుందా.? చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS