ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా 'విజిల్'. ఇళయ దళపతి విజయ్ నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని, సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే, సినిమా నిడివి ఎక్కువ ఉందన్న కారణంగా, కొన్ని సన్నివేశాల్ని కత్తిరించాల్సి వచ్చిందట. చాలా సినిమాలకు విడుదలయ్యాక రెస్పాన్స్‌ని బట్టి కొన్ని సీన్లు లేపేయడం, అవకాశాన్ని బట్టి, కొన్ని జత చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు విజయ్ సినిమాకీ జరిగింది. అయితే, లేపేసిన సీన్ల కారణంగా నిడివి కంఫర్ట్‌బుల్‌గా ఉండడంతో, మరో సినిమా వచ్చేవరకూ 'విజిల్' రన్ రేట్ బాగానే ఉండొచ్చు.
అయితే, వీక్ డేస్‌లో కలెక్షన్లు ఆశించిన స్థాయిలో ఉండవు. కానీ, ఫర్వాలేదనిపిస్తాయి అంతే. ఇదిలా ఉంటే, తెలుగులో విజయ్‌కి పెద్దగా మార్కెట్ లేకపోయినా, ఈ సినిమాకి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తి 'ఖైదీ' చిత్రం ఈ సినిమాతో పోటీ పడింది. విజయ్‌తో పోల్చితే, కార్తికి తెలుగులో ఫాలోయింగ్ బాగానే ఉంది. తెలుగులో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో, ఈ రెండు సినిమాలూ బాగానే క్యాష్ చేసుకున్నాయి.
'ఖైదీ'తో పోల్చితే, 'విజిల్'కి కమర్షియల్ హంగులు ఎక్కువగా ఉండడంతో, ఆడియన్స్ బాగానే ఎట్రాక్ట్ అయ్యారు. నయనతార ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా నటించింది. విజయ్‌తో 'తెరి', 'మెర్సల్' వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలు తెరకెక్కించిన అట్లీ ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకున్నాడు.