తనపై హత్యా బెదిరింపులు వస్తున్నాయని నటి శ్రీరెడ్డి చెన్నై పోలీస్ కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఇంతకీ విషయమేంటంటే, ఇష్టమొచ్చినట్లు సినీ ప్రముఖులందరిపైనా నోరు పారేసుకునే శ్రీరెడ్డి ఇటీవల మరో నటి కరాటే కళ్యాణిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలకు పాల్పడిన సంగతి తెలిసిందే. కరాటే కళ్యాణితో పాటు, డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ పైనా శ్రీరెడ్డి అలాగే నోరు పారేసుకుంది. దాంతో వీరిద్దరూ తెలంగాణా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాను ఈ మధ్య తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నాననీ, అలా వచ్చిన సొమ్ముతో ఇల్లు, కారు కొనుక్కున్నానన్న జలసీతో వీరు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ చెన్నై పోలీస్ కమీషనర్ ఆఫీస్‌లో రివర్స్ కేస్ పెట్టింది శ్రీరెడ్డి.
ఇక తాజాగా తనను పెట్రోల్ పోసి తగులబెట్టేస్తామంటూ సదరు వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయనీ శ్రీరెడ్డి పేర్కొంది. శ్రీరెడ్డిపై కేసులు కామనే. కానీ, ఈ సారి విషయం కాస్త సీరియస్‌గా మారినట్లుంది. కరాటే కళ్యాణి, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ ఈ ఇష్యూని చాలా పర్సనల్‌గా తీసుకున్నారు. శ్రీరెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని కంకణం కట్టుకున్నారు. మరి,ఈ సీరియస్ సిట్యువేషన్ నుండి శ్రీరెడ్డి ఎలా బయటపడుతుంది.? తాను పేర్కొన ఫిర్యాదుకు శ్రీరెడ్డి కట్టుబడి ఉంటుందా.? ఏం జరుగుతందనేది చూడాలిక.