అర్ధనగ్న నిరసన ప్రదర్శనతో రోడ్డెక్కి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీరెడ్డి, తాజాగా తిరుపతికి వెళ్ళింది. ఈ క్రమంలో ఓ ప్రముఖుడు శ్రీరెడ్డికి అడ్డంగా దొరికేశాడట. ఆమెతోపాటే విమానంలో ప్రయాణించిన ఆ వ్యక్తి పక్కనే శ్రీరెడ్డికి సీటు దొరికిందట. 'నన్ను కెలికినోడు దొరికాడు.. నన్ను చూడగానే వాడికి డాష్ డాష్‌లో డాష్ డాష్ అయ్యింది..' అంటూ శ్రీరెడ్డి అసభ్యకరమైన రీతిలో కామెంట్ పోస్ట్ చేసింది.
ఇంతటి జుగుప్సాకరమైన భాషతో సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకోవడం శ్రీరెడ్డికే చెల్లుతుందేమో. ఇటీవలి కాలంలో చాలామందిపై శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే. అయితే వారిలో ఎవరు, శ్రీరెడ్డికి అడ్డంగా దొరికారన్నది తేలలేదు. ఏసీలో కూడా శ్రీరెడ్డి, ఆ వ్యక్తికి చెమటలు పట్టించేసిందట. శ్రీరెడ్డి మురిసిపోతోందిగానీ, ఆమెకి సోషల్ మీడియాలో కౌంటర్లు ఇంకో రకంగా పడుతున్నాయి. మరోపక్క, విమానంలో ఈ తతంగం నిజంగానే జరిగితో తోటి ప్రయాణీకులకు విషయం తెలియకుండా వుంటుందా? ఇద్దరూ సెలబ్రిటీలే కాబట్టి, ఖచ్చితంగా వారిపై అందరికీ ఫోకస్ వుంటుంది. జరగని ఘటనను జరిగినట్లుగా శ్రీరెడ్డి భలే స్క్రీన్‌ప్లే రాసి పబ్లిసిటీ చేసుకుంటోందని కొందరు అంటోంటే, అది నిజమే కావొచ్చని ఇంకొందరు చెప్పుకుంటున్నారు.
నిజమేంటోగానీ శ్రీరెడ్డి మాత్రం ప్రతి చిన్న విషయాన్నీ పబ్లిసిటీ కోసం వాడుకుంటోంది. ఇంత చేసినా శ్రీరెడ్డికి రావాల్సిన స్థాయిలో పబ్లిసిటీ అయితే రావడంలేదు. మొదట్లో ఎంకరేజ్ చేసిన ఓ వర్గం మీడియా శ్రీరెడ్డిని ఇప్పుడు పూర్తిగా లైట్ తీసుకుంది.